English | Telugu

నా కొడుకు అర్జున్ రెడ్డి అన్న సుమ.. మనోజ్ ఏంటి అలా అనేశాడు!

ఈటీవీలో దీవాలి స్పెషల్ ఈవెంట్ గా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే ఈవెంట్ రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోస్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి.. రీసెంట్ గా ఇంకో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో మంచి ఫన్నీ కంటెంట్ ఉందనే విషయం ఈ ప్రోమో చూస్తే తెలిసిపోతుంది. ఇందులో సుమని తన సుపుత్రుడు రోషన్ కనకాల ఇంటర్వ్యూ చేసాడు. "బబుల్ గం టీజర్ చూసాక మీ థాట్స్ ఏమిటి" అని రోషన్ సుమని అడిగేసరికి "నేను శంకరాభరణం సినిమాను విపరీతంగా ఇష్టపడ్డాను, అర్జున్ రెడ్డి మూవీని కూడా బాగా లైక్ చేసాను .." అని వెరైటీ ఆన్సర్ ఇచ్చేసరికి హైపర్ ఆది మధ్యలో వచ్చి "ఇంతకు మీ కొడుకు శంకరాభరణమా, అర్జున్ రెడ్డా ?" అని ఫన్నీగా అడిగాడు. "నా కొడుకు అర్జున్ రెడ్డే" అని గట్టిగ నవ్వుతూ చెప్పింది సుమ. 

Guppedantha Manasu: దేవయానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఫణీంద్ర.. అనుపమ ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -912 లో.. జగతి కేసులో  ఇన్వెస్టిగేషన్ కోసం స్పెషల్ ఆఫీసర్ గా ముకుల్ వచ్చి.. ఈ కేసులోని నిందితులని కచ్చితంగా పట్టుకుంటానని ప్రామిస్ చేస్తాడు. అది విని ఎక్కడ తమ గురించి బయట పడుతుందో అన్న టెన్షన్ లో శైలేంద్ర దేవయాని ఇద్దరు ఉంటారు. అప్పుడే వచ్చిన ధరణి పుండు మీద కారం చల్లినట్లుగా వాళ్ళకి సెటైర్ వెయ్యడంతో శైలేంద్రకి ఇంక మండుతుంది. మామయ్య గారు మిమ్మల్ని ఇద్దరిని మాట్లాడుకోకుండా చూసుకోమని ఒక టాస్క్ ఇచ్చారని ధరణి చెప్పి వెళ్ళిపోతుంది.