English | Telugu
శివాజీ టాప్-5 కంటెస్టెంట్.. శోభాశెట్టి ఆంటీనా?
Updated : Nov 12, 2023
బిగ్ బాస్ సీజన్-7 మొదలై ఇప్పటికే పది వారాలు పూర్తిచేసుకుంది. కంటెస్టెంట్స్ ఆటతీరు, మాటతీరుకి బయట ఒక్కొక్కరికి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. గతవారమంతా ఫ్యామిలీ వీక్ జరిగిన విషయం తెలిసిందే. అయితే దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.
కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చి శివాజీని టాప్-5 లో ఉంచారు. గౌతమ్ కృష్ణ వాళ్ళ అన్నయ్య, అమర్ దీప్ వాళ్ళ అమ్మ, పల్లవి ప్రశాంత్ అమ్మ, అక్క.. ఇలా ఎవరొచ్చిన శివాజీని టాప్-5 లో ఉంచారు. దీన్ని బట్టి హౌస్ లోనొ వాళ్ళకి ఇప్పటికే శివాజీ టాప్-5 లో ఉన్నాడని తెలిసిఉంటుంది. ఇక ముందు ఎవరంటేనేది తెలుస్తుంది. శివాజీ ఫ్యామిలీ నుండి శివాజీ భార్య శ్వేత, చిన్న కొడుకు రిక్కీ వచ్చారు. మేము ఇలా ఉన్నామంటే దానికి మీరూ, చిరంజీవి గారే కారణం.. అంటూ నాగార్జునతో శ్వేత అంది. ఇక శివాజీ కొడుకు రిక్కీ మాట్లాడుతూ.. నువ్వు ఎంత పెద్ద హీరోవో నాకు తెలీదు కానీ ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఒక శివన్న ఉన్నాడంటు చెప్పాడు. ఇక తమ దృష్టిలో శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, ప్రియాంకలు టాప్-5లో ఉంటారని చెప్పారు.
ఇక తన భర్తను బాగా చూసుకున్న యావర్, ప్రశాంత్‌లకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది శివాజీ భార్య. యావర్‌తో రిక్కీ మాట్లాడుతూ.. మా అమ్మ మీకు అమ్మే.. మీ బ్రదర్ నాకూ బ్రదరే అని అనగానే యావర్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఇక అమర్ దీప్- డాడీ మధ్య గొడవని బాగా ఎంజాయ్ చేశానని రిక్కీ అన్నాడు. శోభా ఆంటీ ఎక్కడ అని రిక్కీ అనగానే.. ఆంటీనా అంటు శోభా షాక్ అయ్యింది. మా అమ్మని ఆంటీ అంది అందుకే అలా అన్నానని రిక్కీ అనగానే.. శివాజీ నీ కొడుకుకి సెన్సాఫ్ హ్యూమర్ బాగానే ఉంది కదా అని నాగార్జున అన్నాడు. నాన్న నీకు ఈ అయిదు వారాలు చాలా ఇంపార్టెంట్. ఇంకెప్పుడు బయటకొచ్చేస్తానని అనొద్దని రిక్కీ చెప్పాడు.