English | Telugu
Bhole Shavali : భోలే షావలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Updated : Nov 13, 2023
బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకుంది. ఇందులో తొమ్మిదవ వారం టేస్టీ తేజ ఎలిమినేషన్ అవ్వగా, పదవ వారం భోలే షావలి ఎలిమినేట్ అయ్యాడు. గ్రాంఢ్ లాంచ్ 2.0 లో పాట బిడ్డగా ఎంట్రీ ఇచ్చాడు భోలే షావలి.
బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్స్ కొందరు డిఫరెంట్ స్ట్రాటజీని వాడుతున్నారు. అమర్ దీప్ గత ఎనిమిది వారాలుగా డమ్మీ పీస్ లా అనిపించి, తొమ్మిదో వారం పర్వాలేదనిపించాడు. ఇలా ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా మారిపోతుంటే.. పాటబిడ్డగా అడుగుపెట్టిన భోలే ఫెయిర్ గేమ్ ఆడుతూ జనాల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయిదు వారాలు ఉన్న భోలే షావలి ఎన్నో పాటలని పాడాడు. అందులో అమ్మ గురించి పాడిన పాట ఎంతోమందిని చేరింది. హౌస్ లో తన పాటలతో చక్కని మాటతీరుతో ఆకట్టుకున్న భోలే షావలి.. టాస్క్ లలో పెద్దగా ఎఫర్ట్ పెట్టకపోవడం తన ఎలిమినేషన్ కి కారణమని చెప్పాలి. ఎందుకంటే హౌస్ లో ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు టాస్క్ లు బాగా ఆడగలగాలి. ఆటతీరు, మాటతీరు కంటెస్టెంట్స్ ని టాప్ లో ఉంచేలా చేస్తాయి. ప్రతీ వారం భోలే షావలిని సీరియల్ బ్యాచ్ టార్గెట్ చేసి నామినేషన్ లో పెట్టడంతో అతను కొన్నిసార్లు మాట జారాడు. ఇది అతనికి ఒకరకంగా మైనస్ అయింది.
భోలే షావలి పాటలకి గెస్ట్ లతో పాటు నాగార్జున ఫిధా అయ్యాడు. అంతలా ఆకట్టుకున్న భోలే ఎలిమినేషన్ అవ్వడంతో ఇన్ స్టాగ్రామ్ లో అతని ఫ్యాన్స్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ పోస్ట్ లు చేస్తున్నారు. రోజుకి పదిహేడు వేల చొప్పున వారానికి లక్ష ఇరవై అయిదు వేల వరకు భోలే షావలి రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతను హౌస్ లో ఉన్న అయిదు వారాలకి గాను 6 లక్షల 25 వేల వరకు రెమ్యునరేషన్ ముట్టినట్టుగా తెలుస్తుంది. పదో వారం పాట బిడ్డ ఎలిమినేషన్ తో హౌస్ లో ఇంకా పది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.