English | Telugu

రాత్రి 2 అయ్యింది.. కర్ర బాగా పనిచేస్తోంది... సిగ్గుపడ్డ రాజీవ్ కనకాల!

అలీతో ఆల్ ఇన్ వన్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, అనిత చౌదరి ఎంట్రీ ఇచ్చారు. "రోషన్ ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు కదా..ఎప్పుడైనా తాను నటించేటప్పుడు సెట్ కి వెళ్ళావా ... నువ్వు వెళ్లే సమయానికి ఏదైనా రొమాంటిక్ సీన్ చేస్తూ ఉన్నాడా " అని అడిగాడు ఆలీ అడిగేసరికి "ఎగ్జాక్ట్లీ నేను వెళ్లేసరికి అలాంటి సీన్ చేస్తున్నాడు. "అరె నువ్వుండారా...ఎలా చేయాలో నేను చేసి చూపిస్తా" అన్నావా అని ఆలీ అడిగేసరికి రాజీవ్ కనకాల నవ్వేసాడు. తర్వాత హర్షవర్ధన్ మంచి డాన్స్ స్టెప్స్ వేసుకుంటూ వచ్చేసరికి "డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు" అన్నాడు ఆది. "మీ దగ్గరే" అన్నారు హర్షవర్ధన్. "డాన్స్ ఇలా కూడా చేయొచ్చంటావా" అని అలీ అడిగేసరికి "ఇలాగే చేయాలన్నా" అన్నారు హర్షవర్ధన్. తర్వాత అనిత చౌదరి ఎంట్రీ ఇచ్చారు. "అనిత గారు మీ అమ్మగారు ఎలా ఉన్నారు" అనేసరికి "బాగున్నారు మిమ్మల్ని అడిగానని చెప్పామన్నారు" అంది అనిత చౌదరి.

"పర్లేదు కదా ఇప్పుడు నడుస్తున్నారు కదా" అని మళ్ళీ ఆలీ అడిగేసరికి "మీరు ఇచ్చిన కర్రబాగా పనిచేస్తోంది" అని చెప్పింది అనిత చౌదరి. తర్వాత "సినిమా చాల ఇంటరెస్టింగ్ ఉంది...రాత్రి 2 అయ్యింది. పైకి వెళ్లి పడుకోలేదు ఆ సినిమా చూసాక" అని ఆలీ అనేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత రాజీవ్ కనకాలను స్టేజి మీదకు పిలిచి కొన్ని ఇమేజెస్ ఇచ్చి వాటితో ఒక సినిమా కథ చెప్పామన్నారు ఆలీ..దానికి ఆయన "ఓపెన్ చేస్తే" అన్నారు "ఇంతకు ఎం ఓపెన్ చేస్తే" అంటూ ఆలీ రివర్స్ లో అడిగేసరికి రాజీవ్ కనకాల తలదించుకుని సిగ్గు పడిపోయాడు.