English | Telugu

అప్పుడు మా ఫామిలీని పక్కన పెట్టారు...ఇప్పుడు మా పక్కనే ఉంటున్నారు

ఢీ సెమీఫైనల్స్ పోటా పోటీగా జరుగుతున్నాయి. ఈ వారం ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది. ఇందులో జడ్జిగా ఉన్న పూర్ణ కన్నీళ్లు పెట్టుకుని అందరినీ ఏడిపించేసింది. పూర్ణ చెప్పిన మాటలు వింటే తన గత జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా అనే విషయం తెలుస్తుంది. పూర్ణ ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను ఫేస్ చేయాల్సి వచ్చిందంటూ ఏడ్చేసారికి పక్కనే ఉన్న శేఖర్ మాష్టర్ ఆమెను ఓదార్చారు. "మా ఫామిలీలో ఎవరూ డాన్స్ క్లాస్ కి వెళ్ళింది లేదు. నేను ఒక్కదాన్నే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న అమ్మాయిని. నేను డాన్స్ నేర్చుకున్న విషయం తెలిసాక మా నాన్న తరపున వాళ్ళ ఎవరూ కూడా మాతో మాట్లాడేవారు కాదు.

హాస్పిటల్ బెడ్ మీద బిగ్ బాస్ తేజస్విని పిచ్చి చేష్టలు!

తేజస్వినికి ఏమయ్యిందో కానీ హాస్పిటల్ బెడ్ మీద పిచ్చి చేష్టలు చేస్తూ ఎటో చూస్తున్న ఒక  పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది తేజస్విని మాదివాడ.. డెంటల్, మెంటల్ ప్రాబ్లమ్స్ తో హాస్పిటల్లో చేరినట్లుగా కాప్షన్ పెట్టుకుంది. ఐతే ఆమె వేసుకున్న జీన్ ప్యాంట్ మోకాలి దగ్గర చింపేసుకుని కనిపించేసరికి ఒక నెటిజన్ వెరైటీగా కామెంట్ చేసాడు. "మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ అని బ్రెయిన్ ఉన్న ప్లేస్ ని ఇలా ఓపెన్ గా పెట్టారా" అంటూ ఇన్ డైరెక్ట్ గా మోకాల్లో బ్రెయిన్ ఉంది అన్న అర్ధం వచ్చేలా కామెంట్ చేసారు. ఇంకో నెటిజన్ మాత్రం "బాధపడకండి..అంతా బాగుంటుంది" అని విష్ చేశారు. ఇక తేజస్విని తాను హాస్పిటల్ కి వెళ్లడమే కాదు డెంటిస్ట్ అవతారం ఎత్తింది.

శ్రీకృష్ణుడి లాంటి భర్త రాబోతున్నాడు...త్వరలో చూపిస్తాను

మాధవీలత అంటే చాలు  నచ్చావులే మూవీ గుర్తొస్తుంది. తర్వాత  స్నేహితుడా, అరవింద్ 2 మూవీస్ లో ఆమె యాక్షన్ గుర్తొస్తుంది. ఆ తర్వాత మూవీస్ కి ఆమె పూర్తిగా దూరమైపోయారు.తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవి లతా వాటిల్లో యాక్టివ్ గా లేరు. కానీ ఇప్పుడు  సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ ఉంటున్నారు. ఎక్కడ ఏ ఇష్యూ చూసినా, తన చెవిన పడినా, కంట పడినా వాటిని తన కామెంట్స్ తో చీల్చి చెండాడేస్తోంది. అలాంటి మాధవి లతా తాను చేసుకోబోయే అబ్బాయిని ఆ శ్రీకృష్ణుడే చూపించాడని కానీ దిష్టి తగులుతుంది అని ఎవరికీ చూపించడం లేదు అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.