English | Telugu
Bigg Boss 7 : హౌస్ లో పాస్ ఎవరో? ఫెయిల్ ఎవరో తెలుసా?
Updated : Nov 12, 2023
బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి సరికొత్తగా సాగుతుంది. హౌస్ లో ఈ వారమంతా ఫ్యామిలీ వీక్ సాగింది. అందులో మొదట శివాజీ వాళ్ళ కొడుకు, అంబటి అర్జున్ భార్య, అశ్విని అమ్మ, శోభాశెట్టి అమ్మ, గౌతమ్ అమ్మ, ప్రియాంక బాయ్ ఫ్రెండ్, యావర్ అన్నయ్య, భోలే షావలి భార్య, రతిక వాళ్ళ నాన్న, ప్రశాంత్ వాళ్ళ నాన్న వచ్చారు. దీంతో ప్రతీ ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠగా ఎమోషనల్ గా సాగింది.
ఇక శనివారం నాటి ఎపిసోడ్ లో అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్ తో నాగార్జున వచ్చేశాడు. కంటెస్టెంట్స్ అందరిని ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు నాగార్జున. హౌస్ లో కొత్త కెప్టెన్ ఎవరో మీ అభిప్రాయం చెప్పమని నాగార్జున చెప్పాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళి తమ అభిప్రయాలని చెప్తూ శివాజీని 9-0 ఓట్లతో గెలిపించారు. ఇక హౌస్ కి కొత్త కెప్టెన్ శివాజీ అయ్యాడు. ఇక ఈ పది వారాలుగా ఎవరు బాగా ఆడారో తెలుసుకోవాలని పాస్? ఫెయిల్? ఎవరని ఒక్కొక్కరిని పిలిచి అక్కడ ఉన్న బ్లాక్ బోర్డ్ మీద రాయమని చెప్పాడు నాగార్జున. మొదట శోభాశెట్టిని పిలిచి అడిగాడు. అమర్ దీప్ పాస్, రతిక ఫెయిల్ అని బోర్డ్ మీద శోభా శెట్డి రాసింది. సెకండ్ శివాజీ వచ్చి యావర్ పాస్ అని రతిక ఫెయిల్ అని బోర్డ్ మీద రాశాడు. ఆ తర్వాత అంబటి అర్జున్ వచ్చి భోలే షావలి పాస్ అని, అమర్ దీప్ ఫెయిల్ అని బోర్డ్ మీద రాశాడు. " భోలే అన్న అసలు ఫస్ట్ వీక్ లోనే వెళ్లిపోతాడని అనుకున్నాను. కానీ చాలా చేంజ్ అయ్యాడు. బాగా ఇంప్రూవ్ అయ్యాడు" అని అంబటి అర్జున్ అన్నాడు.
పక్కోడు ఓడిపోవాలని ఆడితే వాడెప్పుడు గెలవలేడు. వాడు గెలవాలని ఆడితేనే గెలుస్తాడని అమర్ దీప్ గురించి అంబటి అర్జున్ అన్నాడు. ఆ తర్వాత అమర్ దీప్ వచ్చి అర్జున్ పాస్ అని, రతిక ఫెయిల్ అని రాసాడు. ప్రియంక జైన్ వచ్చి శోభాశెట్టి పాస్ అని రతిక ఫెయిల్ అని రాసింది. శోభాశెట్టి ప్రియాంక పాస్, రతిక ఫెయిల్ అని రాసింది. గౌతమ్ కృష్ణ వచ్చి అంబటి అర్జున్ పాస్ అని, రతిక ఫెయిల్ అని రాశాడు. ఆ తర్వాత భోలే షావలి వచ్చి.. పల్లవి ప్రశాంత్ పాస్ అని, రతిక ఫెయిల్ అని రాశాడు. పల్లవి ప్రశాంత్ వచ్చి శివాజీ పాస్ అని రతిక ఫెయిల్ అని బోర్డ్ మీద రాసి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇలా హౌస్ లో ఎక్కువ మంది రతిక ఫెయిల్ అని చెప్పారు.