English | Telugu

దుగ్గిరాల ఇంట్లో శుభవార్త.. కారణం అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -252 లో.. అనామికని కళ్యాణ్ ని కలుస్తాడు. కానీ అనామిక కళ్యాణ్ పై కోపంగా ఉంటుంది. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు. అప్పు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసావని అనగానే కళ్యాణ్ అనామికని బుజ్జగిస్తాడు. అన్ని ఓకే కానీ అప్పు విషయం వచ్చేసరికి అటు వైపే ఇంపార్టెన్స్ ఉంటుందని అనామిక అంటుంది.

ఒకవైపు రాజ్ వీలునామ పత్రాలు చింపి వెయ్యడంతో రుద్రాణి ప్లాన్ మిస్ అయిందని అనుకుంటుంది. అసలు ముసలోడు వీలునామా పత్రాలలో ఏం రాసి ఉంటాడు. మా పేరు మీద ఆస్తి ఏమైనా రాసి ఉంటాడా తెలుసుకోవాలని రాజ్ చింపిసిన పేపర్స్ డస్ట్ బిన్ లో ఉంటే.. అందులో నుండి ఎవరు చూడకుండా పేపర్ ముక్కలు తీసుకుంటుంది రుద్రాణి. అది చూసిన రాహుల్ ఏం చేస్తున్నావ్ ఆ పేపర్స్ తీసుకొని ఏం చేస్తావని రాహుల్ అంటాడు.

రాహుల్ ని గదిలోకి తీసుకొని వెళ్లి.. ఈ పేపర్స్ అతికించు ఇందులో మన పేరున ఏం అయిన ఆస్తులు రాశాడో చూద్దాం దాన్ని బట్టి మరొక ప్లాన్ వేసి ముసలోడిని బ్లాక్ మెయిల్ చేసి ఆస్తి రాయిచుకుంటానని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాహుల్ పేపర్ అతికించగానే.. అందులో ఉన్నది చదివి రుద్రాణి షాక్ అవుతుంది. వీలునామ పత్రంలో ఈ ఆస్తులన్నింటిని అనుభవించే హక్కు అందరికి ఉంటుంది. కానీ ఈ ఆస్తులు ఎవరి పేరున రాయడం లేదు. ఈ ఆస్తులు అన్ని మునిమనవళ్ళకి చెందుతాయని అందులో ఉండడం చూసిన రుద్రాణి.. ఇదేంటి ఇలా రాశాడంటూ, ఒకవైపు కోపంగా, మరొక వైపు బాధగా ఉంటుంది. వీలునామాలో ఏం రాశాడు అనేది ఇందిరాదేవికి సీతారామయ్య చెప్తాడు.

రాజ్ కి తన ఫ్రెండ్ కాల్ చేసి అమెరికా నుండి డాక్టర్ వస్తున్నాడు. ఎయిర్ పోర్ట్ కీ వెళ్లి రిసీవ్ చేసుకోమని చెప్పగానే.. రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏమైంది హ్యాపీగా ఉన్నావని అపర్ణ అడుగుతుంది. తాతయ్య కోసం అమెరికా నుండి డాక్టర్ వస్తున్నాడని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఒకవైపు అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతు.. ఇంట్లో అందరిని పిలిచి ఆ విషయం చెప్తుంది. అందరూ సీతారామయ్య గురించి ఇక బయపడవలిసిన అవసరం లేదని అనుకుంటారు. ఆ తర్వాత డాక్టర్ ని రాజ్ తీసుకొని వస్తాడు. డాక్టర్ వచ్చి రిపోర్ట్స్, సీతారామయ్యని చుసి.. మీరేం టెన్షన్ పడనవసరం లేదు.

క్యాన్సర్ ని నేను పూర్తిగా నయం చేస్తాను కానీ మీరు కూడా అతన్ని ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చూడాలని ఇంట్లోని వారితో డాక్టర్ అంటాడు. దాంతో దుగ్గిరాల కుటుంబం మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ ఉమ్మడి కుటుంబం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఇలాగే ఉండండని డాక్టర్ అంటాడు. మా అయనకి కూడా ఈ కుటుంబం ముక్కలు కాకుండదనే ఉంది. మీరు కూడా అలాగే చెప్పారు. సంతోషంగా ఉంచితే ఏ మందులు మింగాల్సిన అవసరం లేదని ఇందిరదేవి సంబరపడుతుంది. తరువాయి భాగంలో.. ఎప్పటిలాగే రాజ్, కావ్యల మధ్య గొడవ జరుగుతుంది. ఇక నుండి నేను నటించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో చుడండని కావ్య అంటుంది. అసలు ఇంతకీ కావ్య ఏం చెయ్యబోతుందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.