English | Telugu

అమ్మనాన్నలకి సర్ ప్రైజ్ ఇచ్చిన శ్రీముఖి!

దీపావళి రోజున ప్రతీ ఇంట్లో పూలు, దీపాలతో అలంకరించి గ్రాంఢ్ గా జరుపుకుంటున్నారు. అయితే కొందరు సెలబ్రిటీలు అవుట్ డోర్ షూటింగ్ అంటు బిజీగా ఉంటే, మరికొందరు తమ ఫ్యామిలీని కలవడానికి సొంతింటికి వెళ్తున్నారు. అదే కోవలోకి శ్రీముఖి చేరింది. శ్రీముఖి తన అమ్మనాన్నలు కలిసి దీపావళి పండుగ జరుపుకుంది. శ్రీముఖీ వాళ్ల అమ్మనాన్నలకి సర్ ప్రైజ్ అని చెప్పగానే .. వాళ్ళు షాక్ అయ్యారు. ఇక సస్పెన్స్ కి తెరతీస్తూ అమ్మకి డైమండ్ నక్లెస్, నాన్నకి బంగారపు గొలుసు గిఫ్ట్ గా ఇచ్చింది శ్రీముఖి. అయితే ఇలాంటి గిఫ్ట్ లు తనకి ప్రతీ నెల కావాలంటూ శ్రీముఖి వాళ్ళ అమ్మ చెప్పుకొచ్చింది.