English | Telugu
ఆ పొగరే తన సిగ్నేచర్.. ఆత్మీయ సమ్మేళనంలో అనుకోని అతిథి!
Updated : Nov 13, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -919 లో.. శైలేంద్ర దేవయానిలని వసుధార తీసిపారేసినట్లు మాట్లాడేసరికి.. వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. నేను తల్చచుకుంటే ఇప్పటికి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించండంటూ వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది వసుధార. ఇదేంటి ఆ వసుధర శివంగిలాగా తయారైందని దేవయాని అంటుంది.
ఒకవైపు అనుపమ తన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కోసం అందరికి ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తుంది. మరొకవైపు రిషి, వసుధార ఇద్దరు కాలేజీకి వెళ్తారు. అప్పుడే రిషికి ముకుల్ కాల్ చెయ్యడంతో వసుధార ఒక్కతే లోపలికి వెళ్తుంది. అప్పుడు శైలేంద్ర వచ్చి.. ఏంటి వసుధార రాత్రి చాలా పొగరుగా మాట్లాడావని అనగానే.. మీ నోటి నుండి పొగరు అనే మాట వస్తే చిరాకుగా ఉంటుంది. ఇంకొక సారి అనకండి. అవును నాకు పొగరు. పొగరు అనేది నా సిగ్నెచర్ అని శైలేంద్రతో వసుధార అంటుంది. అయిన మీరు కాలేజీకీ ఎందుకు వచ్చారు.
ఈ రోజు అటెండర్ రాలేదు. ఆ డ్యూటీ చెయ్యడానికి వచ్చారా అని వసుధార అనగానే.. మాటలు జాగ్రత్తగా రానియ్యి వసుధార అని అంటాడు. అప్పుడే రిషి వచ్చి.. ఏంటి అన్నయ్య అలా అంటున్నావ్ వసుధార ఏం అందని అడుగుతాడు. నీకు పొగరని అంటున్నాడు సర్. అది రిషి సర్ ఎప్పుడు అనే మాటనే అని నేను అంటున్నా సర్ అని వసుధార అనగానే.. అవును వసుధారకి పొగరు. ఆ పొగరు వల్లే నేను ఇంప్రెస్ అయ్యాను. అదే తనకి ప్లస్ పాయింట్ అని రిషి అంటాడు. అప్పుడే ముకుల్ ని రిషి కలవడానికి వెళ్తాడు. ఆ తర్వాత జగతి కేసు గురించి ముకుల్ మాట్లాడతాడు.
మరొక వైపు మహేంద్రకి తన ఫ్రెండ్ కాల్ చేసి అల్యూమినికీ రమ్మని చెప్తాడు. నేను రానంటూ మహేంద్ర కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే రిషి వచ్చి ఎవరు ఎక్కడకి రమ్మంటున్నారని అడుగుతాడు. ఏం లేదంటూ మహేంద్ర వెళ్లిపోతుంటే.. తన పాకెట్ నుండి ఫోన్ కిందకి పడిపోతుంది. ఆ తర్వాత మహేంద్ర ఫోన్ కి అనుపమ కాల్ చేస్తుంది. అప్పుడు రిషి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. రిషి మాట గుర్తు పడుతుంది అనుపమ. అలాగే అనుపమని కూడ గుర్తుపడతాడు రిషి.
మేం అల్యూమిని ఫంక్షన్ చేస్తున్నాం. మీ డాడ్ ని తీసుకొని రా అని అనుపమ అనగానే.. మా డాడ్ ఎలా తెలుసని రిషి అడుగుతాడు. నువ్వు ఫంక్షన్ కి, మీ డాడ్ ని తీసుకొని రా అన్ని ప్రశ్నలకీ సమాధానం దొరుకుతుందని అనుపమ అంటుంది. అలాగే మీ అమ్మ జగతిని కూడా తీసుకొని రా అని ఫోన్ కట్ చేస్తుంది. అనుపమ ఫోన్ చేసిన విషయం గురించి వసుధారకి రిషి చెప్పి.. ఎలాగైనా డాడ్ కి తెలియకుండా డాడ్ ని ఫంక్షన్ కి తీసుకొని వెళ్ళాలని అనుకుంటారు. ఆ తర్వాత మరుసటి రోజు మహేంద్రని తీసుకొని రిషి, వసుధార ఇద్దరు అల్యూమిని ఫంక్షన్ దగ్గరికి వస్తారు. అక్కడ ఆత్మీయ సమ్మేళనం అని ఫ్లెక్సీ చూసి మహేంద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.