English | Telugu

బిగ్ బాస్ బ్యూటీ సొంత విల్లాలో రేవ్ పార్టీ.. 11 మంది అరెస్ట్!


బిగ్ బాస్ ఫేమ్ హిమజకు సంబంధించిన ఒక న్యూస్ రీసెంట్ గా టాప్ హెడ్ లైన్స్ లో వచ్చిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తన సొంత విల్లాలో రేవ్ పార్టీ చేసుకున్నట్లు ఈ పార్టీపై పోలీసులు దాడి చేసి హిమజ సహా 11 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అయితే ఆ వార్తపై హిమాజ ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో తాను దీపావళి పండుగ కొత్త ఇంటిలో ఘనంగా జరుపుకుంటుంటే కొన్ని ఛానల్స్, ఫేక్ యాప్ లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అంటూ ఫైర్ అయ్యారు. అటువంటి వార్తల్ని నమ్మొద్దంటూ హితవు పలికారు. తన ఇంట్లో పార్టీ జరిగిన మాట వాస్తవమే..ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారానికి పోలీసులు వచ్చి తన ఇంటిని సోదాలు చేశారని తాను కూడా ఎంక్వైరీకి సహాకరించాను అని చెప్పారు హిమజ.

తనపైన తన పార్టీకి వచ్చిన వారి పైన కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం వంటివేవీ లేవని స్పష్టం చేశారు. కొత్త ఇంట్లో దీపావళి వేడుకల కోసం సన్నిహితులను పిలిచానని, పూజా కార్యక్రమాలు నిర్వహించానని హిమజ వెల్లడించారు. తాను అరెస్ట్ అయ్యానన్న వార్తలతో తనకు ఫోన్లు వస్తున్నాయని వాటన్నిటికీ చెక్ పెట్టడానికే అందరికీ వాస్తవం ఏంటో తెలియాలనే ఉద్దేశంతోనే ఇలా లైవ్ లోకి వచ్చానని వివరణ ఇచ్చారు. బిగ్ బాస్ 3 వ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చేసరికి తెలుగు ఆడియన్స్ కి హిమజ గురించి తెలిసింది. అప్పుడప్పుడు కొన్ని మూవీస్ లో నటించినా కూడా ఆమెకు పెద్దగా పేరు రాలేదు కానీ బిగ్ బాస్ ద్వారా మంచి పేరు వచ్చింది. ఐతే హిమజ రిలీజ్ చేసిన ఈ వీడియోకి కామెంట్ సెక్షన్ ని క్లోజ్ చేసేసింది హిమజ.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.