English | Telugu

శ్రీకృష్ణుడి లాంటి భర్త రాబోతున్నాడు...త్వరలో చూపిస్తాను

మాధవీలత అంటే చాలు  నచ్చావులే మూవీ గుర్తొస్తుంది. తర్వాత  స్నేహితుడా, అరవింద్ 2 మూవీస్ లో ఆమె యాక్షన్ గుర్తొస్తుంది. ఆ తర్వాత మూవీస్ కి ఆమె పూర్తిగా దూరమైపోయారు.తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవి లతా వాటిల్లో యాక్టివ్ గా లేరు. కానీ ఇప్పుడు  సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ ఉంటున్నారు. ఎక్కడ ఏ ఇష్యూ చూసినా, తన చెవిన పడినా, కంట పడినా వాటిని తన కామెంట్స్ తో చీల్చి చెండాడేస్తోంది. అలాంటి మాధవి లతా తాను చేసుకోబోయే అబ్బాయిని ఆ శ్రీకృష్ణుడే చూపించాడని కానీ దిష్టి తగులుతుంది అని ఎవరికీ చూపించడం లేదు అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.