English | Telugu
శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ అరుదైన రికార్డు!
Updated : Nov 12, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఎంతగానో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. శివాజీ మాటే వేదంలా, అతనేం చెప్తే దానిని ఫాలో అవుతూ తోటి హౌస్ మేట్స్ సపోర్ట్ ని గెలుచుకున్నాడు.
హౌస్ లోకి వచ్చిన మొదట్లో ఎవరితో మాట్లాడకుండా ఉన్న పల్లవి ప్రశాంత్ ని శివాజీ ఎలా ఉండాలో చెప్తూ ప్రతీసారీ తనకి సపోర్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు అదే పల్లవి ప్రశాంత్ ని టాప్-5 లో ఉండేలా చేసింది. బిగ్ బాస్ ఏదైన టాస్క్ పెడితే మెరుపుదాడితో ఆడే పల్లవి ప్రశాంత్.. తోటి హౌస్ మేట్స్ మెప్పు పొందాడు. సీరియల్ బ్యాచ్ మొత్తం కలిసి ప్రతీ నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశారు. శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ కలిసి గెలుపోటములని సరిసమానంగా తోసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఎవరి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయకుండా తమ ఆట తాము ఆడుకుంటూ యావర్, ప్రశాంత్, శివాజీ ఈ ముగ్గరు ఫెయిర్ గేమ్ ఆడుతూ బిగ్ బాస్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటున్నారు.
దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చిన వారిలో దాదాపు అందరూ శివాజీ, ప్రశాంత్, యావర్ ని టాప్-5 లో ఉంచారు. బిగ్ బాస్ సీజన్-7 టైటిల్ విన్నర్ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి వస్తుందని ఇప్పటికే బిగ్ బాస్ ప్రేక్షకులు భావిస్తున్నారు. అది నిన్నటి ఎపిసోడ్ లో స్పష్టంగా తెలిసింది. నిన్న హైపర్ ఆది స్టేజ్ మీదకి వచ్చి పల్లవి ప్రశాంత్ కి క్లియర్ గా చెప్పాడు. రతిక వెనుక తిరిగి ఎక్కడ ఆగమైతావో అని అనుకున్నాం కానీ ఎదురులేని మనిషిలా నిలిచావని అన్నాడు. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ ఇప్పటివరకు హౌస్ లో ఉన్న తీరుగా ఉంటే ఖచ్చితంగా టాప్-5 లో ఉంటారని తెలుస్తుంది.