English | Telugu
BiggBoss 7 Telugu : అంబటి అర్జున్ చేతిలో కీలుబొమ్మలా మారిన గౌతమ్!
Updated : Nov 14, 2023
బిగ్ బాస్ సీజన్-7 అందరి అంచనాలకు మించి సాగుతుంది. విమర్శకుల ప్రశంసలు గెలుచుకుంటుంది. ఇప్పటి దాకా ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్నట్టు సాగుతుంది సీజన్-7.
హౌస్ లో నిన్న మొన్నటి దాకా ఫ్యామీలీ వీక్ ఎపిసోడ్ లతో ఫుల్ ఎమోషనల్ చేశాడు బిగ్ బాస్. ఇక వీకెండ్ లో ఓ బేబీ అంటు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చి హౌస్ మేట్స్ మెజారిటీ ఓటింగ్ తో శివాజీ కెప్టెన్ అయ్యాడు. అయితే గతవారం భోలే షావలి ఎలిమినేషన్ అవ్వగా హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక హౌస్ లోని కంటెస్టెంట్స్ ఎవరి గేమ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. గ్రాంఢ్ లాంచ్ 2.0 లో హౌస్ లోకి వచ్చిన అంబటి అర్జున్ అన్నీ తెలుసుకొని వచ్చాడు. కన్నింగ్ మైండ్ సెట్ తో శివాజీని తప్పించాలని, ఎలాగైనా ఇరికించాలని పదే పదే ప్రయత్నిస్తూ విఫలమవుతున్నాడు. ఇక ఇదీ చాలదన్నట్టుగా సీక్రెట్ రూమ్ కి వెళ్ళి వచ్చిన అశ్వగంధ( గౌతమ్ కృష్ణ) ని వాడుకుంటున్నాడు. తేనేపూసిన కత్తిని మెల్లిగా అంబటి అర్జున్ దింపుతుంటే.. అబ్బ అర్జున్ అన్న నువ్వు ఏది చెప్తే అదే వేదం. ఏది చెప్తే అదే కరెక్ట్ అన్నట్టుగా మారిపోతున్నాడు.
హౌస్ లో ఆట సందీప్ అంతకముందు సీరియల్ బ్యాచ్ తో కలిసిపోయి శివాజీని టార్గెట్ చేసి అన్ ఫెయిర్ గేమ్ ఆడి బయటకొచ్చేశాడు. ఇప్పుడు అశ్వగంధ(గౌతమ్ కృష్ణ) కి కూడా అదే జరిగేలా ఉంది. హౌస్ మేట్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అందరూ టాప్-5 ఎవరో పెట్టారు. అయిన కళ్ళు తెరచుకోలేని గౌతమ్ కృష్ణ.. అంబటి అర్జున్ చెప్పిన మాటలు వింటూ తన ఇండివిడ్యువల్ గేమ్ ని మర్చిపోయి శివాజీని టార్గెట్ చేస్తున్నాడు. అయితే శివాజీ ఫెయర్ గేమ్ ఆడతాడు. ఆటలో గెలవకపోయిన పర్వాలేదు కానీ ఫెయర్ గా ఆడాలని యావర్, ప్రశాంత్ లకి చెప్తూ తను కూడా అదే ఫాలో అవుతాడు. అందుకే శివాజీ, ప్రశాంత్, యావర్ లకి విశేషమైన ఫ్యాన్ బేస్ పెరిగింది. హౌస్ లో ఫెయిర్ ఉండేవారికి ఎదురులేదని శివాజీ నిరూపిస్తున్నాడు. ఇక పల్లవి ప్రశాంత్, యావర్ ఆటల్లో తమ సత్తా చాటుతున్నారు. దీంతో టాప్-5 లో వీళ్ళు ముగ్గరు ఉంటారని ఇప్పటికే బిగ్ బాస్ అభిమానులు ఒక అంచనాకి వచ్చేశారని తెలుస్తుంది.