English | Telugu

ప్రియంక వరెస్ట్ నామినేషన్.. కప్పు కోసం రాలేదంట!

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే పదివారాలు పూర్తిచేసుకుంది. గతవారం భోలే ఎలిమినేషన్ అవ్వగా హౌస్ లో ప్రస్తుతం పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక పదకొండవ వారం ఎవరు అన్ డిజర్వింగ్ అని భావిస్తున్నారో వారిని నామినేట్ చేయండని చెప్పాడు బిగ్ బాస్. మొదట రతిక నామినేషన్ ని మొదలుపెట్టింది.

ప్రియంక, శోభాశెట్టిలని నామినేట్ చేసింది ప్రియాంక‌. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్, శోభాశెట్టిలని అంబటి అర్జున్ నామినేట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రియంక.. మొదట రతికని నామినేట్ చేసింది. తర్వాత తన రెండో నామినేషన్‌ అశ్వినిని చేసింది. " అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్? ఎందుకు మమ్మల్ని డామినేట్ అని ప్రమోట్ చేస్తున్నావ్" అంటూ ప్రియాంక ప్రశ్నించింది. నేను ప్రమోట్ చేయడమేంటి చూసేవాళ్లకి తెలీదా అంటూ అశ్విని సమాధానమిచ్చింది. నువ్వు లాస్ట్ వీక్ మొత్తం చాలా రూడ్‌గా బిహేవ్ చేశావ్ అంటూ ప్రియంక తన రెండో పాయింట్ చెప్పింది‌. అవును నువ్వు కిచెన్‌లో దేవతవి అందరికీ వంట చేసి పెడతావ్.. తప్పేం కాదు అంటూ అశ్విని అంది. దీనికి ప్రియాంకకి ఎందుకు కోపం వచ్చిందో తెలీదు కానీ.. అలా నన్ను అనొద్దు అంటూ సీరియస్ అయింది. ఇక తర్వాత భోలే ఎలిమినేట్ అయినప్పుడు.. నేను నీతో వచ్చేస్తానంటూ నువ్వు అనడం, ఏడవడం నాకు నచ్చలేదని రీజన్ తో ప్రియాంక నామినేట్ చేసినట్టుగా చెప్పింది. దీంతో నా ఎమోషన్స్ గురించి మాట్లాడటానికి నీకు ఒక్క రైట్ కూడా లేదు. అయినా నేను ఇక్కడికి కప్పు కొట్టుకొని వెళ్లాలని రాలేదు. బిగ్‌బాస్ ఎక్స్‌పీరియన్స్ చేద్దామనే వచ్చానంటూ అశ్విని చెప్పింది. అలా అయితే మరి ఎందుకు గేమ్స్ ఆడుతున్నావ్.. కప్పు గెలవాలనే వాళ్లని ఆడనివ్వు అంటూ వితండవాదం చేసింది ప్రియాంక.

నా ఇష్టం. ఇప్పుడు కూడా గేట్లు ఓపెన్ చేస్తే వెళ్లడానికి నేను రెడీ. అయినా ఏడవడం గురించి ఇంకోసారి నువ్వు మాట్లాడితే మంచిగా ఉండదు చెబుతున్నానని అశ్విని అంది. తేజ ఎలిమినేషన్ అయి వెళ్ళినప్పుడు నేను కూడా వచ్చేస్తానంటూ శోభాశెట్టి ఏడ్చింది. మరి ప్రియాంక అది ఎందుకు రీజన్ గా చెప్పి నామినేట్ చేయలేదు. అసలు నామినేట్ చేయడానికి రీజన్ లేకున్నా ఏదో చేయాలని ఒక చెత్త రీజన్ తో అశ్వినిశ్రీని నామినేట్ చేసింది ప్రియాంక. ఇక వీకెండ్ లో నాగార్జున ఈ టాపిక్ మీద ప్రియంకకి గట్టిగానే క్లాస్ పీకేలా ఉన్నాడు.