English | Telugu

కీరవాణి నాకు మామ..తమన్ మా బాబా

ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ చాల ఫన్నీగా సాగిపోయింది. ఇందులో సద్దాం వేసిన జోక్స్ కి ఆడియన్స్ పడీపడీ నవ్వుకున్నారు. కీరవాణి తనకు మామ అవుతాడని కూడా చెప్పాడు. ఈ షోకి ఎంట్రీ ఇచ్చిన సద్దాం "కీరవాణి గారిని నేను వాణి అని పిలుస్తాను.. ఆయన అసలు పేరు వాణి..ఆయన కీరాలు బాగా గట్టిగా తింటాడు కాబట్టి కీరవాణి అయ్యాడు. బేసిక్ గా ఆయన నాకు మామ. ఒకసారి బాహాబాబు కంపోజింగ్ జరుగుతున్నప్పుడు మామ, నేను, రాజమౌళి గారు అందరం కూర్చుని ఉన్నాం..అప్పుడు ఎందుకో నేను డల్ గా ఉంది బాధపడుతున్నా...ఏంటి అల్లుడు బాధపడుతున్నావ్ అని అడిగాడు. ఎం లేదు మామ నేను ఒక సినిమా ఒప్పుకున్నా.

చీరకట్టులో గీత మాధురి బేబీ బంప్... విడాకుల రూమర్స్ కి బ్రేక్!

తెలుగు ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా  మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సింగర్ గీతామాధురి  ఒకరు. ఈమె పాడిన పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆమె వాయిస్ కి చాలామంది ఫాన్స్ కూడా ఉన్నారు. సాంగ్స్ పాడడమే కాదు పలుషోలకు జడ్జ్ గా కూడా  వ్యవహరిస్తూ  బిజీగా ఉన్నారు. ఇక ఈమె నటుడు నందుని  లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కపుల్ కి  మొదట సంతానంగా  దాక్షాయిని ప్రకృతి అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ చిన్నారి వయసిప్పుడు ఐదేళ్లు.  ఇప్పుడు మరోసారి గీతామాధురి తల్లి కాబోతున్నారని తెలుస్తోంది. ఇక తాను తల్లి కాబోతున్నాను అంటూ శుభవార్తను ఇన్స్టాగ్రామ్  వేదికగా చెప్పారు . తన కుమార్తె దాక్షాయిని ప్రకృతి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో అక్కగా ప్రమోట్ కాబోతుంది అంటూ ఈమె తాను ప్రెగ్నెంట్  అనే విషయాన్ని షేర్ చేసుకున్నారు.

బిబి బజ్ లో శోభాశెట్టికి షాకిచ్చిన గీతు రాయల్!

బిగ్ బాస్ సీజన్-7 లో బాగా పాపులర్ అయిన పేరు శోభాశెట్టి. ఫౌల్ గేమ్ ఆడుతూ, ఎవరేం మాట్లాడిన వారి మీదకి నోరేసుకొని పడిపోతూ చీటికి మాటికి చిరాకు పడే ఏకైక కంటెస్టెంట్ శోభాశెట్టి. హౌస్ లో శోభాశెట్టి గొడవ పెట్టుకోని కంటెస్టెంట్ ఎవరైన ఉన్నారంటే చెప్పడం కష్టం. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో శోభాశెట్టి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బిబి బజ్ ఇంటర్వూలో శోభా శెట్టిని గీతూ రాయల్ గట్టిగానే టార్గెట్ చేసింది. అయితే గీతు అడిగే ప్రశ్నలకి తనదైన స్టయిల్‌లో పొగరుగానే రిప్లయి ఇచ్చింది శోభాశెట్టి. అయితే అమర్‌దీప్.. శోభా గురించి అన్న ఒక వీడియోను  చూపించగానే శోభాశెట్టి ముఖం మాడిపోయింది.

అమ్మాయిలకు దూరంగా ఉండడం ఆరోగ్యకరం..కొరియన్ మొగుడు కావాలన్న శ్రీసత్య

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. ఈ షోకి బిగ్ బాస్ అండ్ బుల్లితెర సెలబ్రిటీస్ ఎంట్రీ ఇచ్చారు...యాదమ్మ రాజు - స్టెల్లా, అర్జున్ కళ్యాణ్- శ్రీ సత్య, శ్రీకర్- హమీద..ఇక వీళ్ళు రాగానే సుమ దోచెయ్ రౌండ్ లో భాగంగా ఒక ప్రశ్న వేసింది. "ఆరోగ్యం అనగానే గుర్తొచ్చేదేమిటి" అని అడిగేసరికి "ఆడవాళ్ళకు దూరంగా ఉండడం" అంటూ ఠకీమని ఆన్సర్ ఇచ్చాడు యాదమ్మ రాజు. "ఈ మాట నువ్వు ఎందుకు చెప్పావ్" అని సుమ అడిగేసరికి "ఎందుకంటే పెళ్లయ్యింది కాబట్టి .. ఆరోగ్యం చెడిపోవడానికి కారణంగా లవ్, మ్యారేజ్ " అని రివర్స్ లో చెప్పాడు.

ప్రొడ్యూసర్ గా కార్తీక దీపం డాక్టర్ బాబు

యష్-వేద అంటే చాలు "ఎన్నెన్నో జన్మల బంధం" సీరియల్ గుర్తు రాక మానదు. ఇక ఈ సీరియల్ లో వీళ్ళ కెమిస్ట్రీకి తెలుగు ఆడియన్స్ ఫుల్ ఫిదా ఇపోయారు. ఇక ఈ సీరియల్‌కి ఎండ్ కార్డు పడిపోయాక ఫ్యాన్స్ అంతా బాధపడుతున్నారు. వీళ్ళ జంటను మళ్ళీ చూస్తామా చూదామా అనుకుంటున్నా ఆడియన్స్ కి స్టార్ మా గుడ్ న్యూస్ చెప్పేసింది. అదే "సత్యభామ" సీరియల్ ని లాంచ్ చేసేసింది. ఇందులో వేద కనిపించేసరికి యష్ కూడా ఉంటే బాగుంటుంది అంటూ కోరుకున్న తెలుగు ఆడియన్స్ కల నెరవేర్చింది స్టార్ మా. ఈ ఇద్దరి స్టార్ కాస్ట్ ఈ సీరియల్ లో మళ్ళీ రిపీట్ కాబోతోంది. ఇప్పుడు "సత్యభామ" సీరియల్ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. "ఎన్నెన్నో జన్మల బంధం" సీరియల్ టైమింగ్స్ లోనే "సత్యభామ" సీరియల్ ని ప్రసారం చేస్తోంది స్టార్ మా.