English | Telugu

రాజ్ కి ముద్దు పెట్టేసిన కావ్య...

ఇయర్ ఎండింగ్  కి వచ్చేసాం. కొత్త ఏడాదిలోకి మరి కొద్ది రోజుల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ఇక బుల్లితెర మంచి కలర్ ఫుల్ గా తయారయ్యింది. ఇప్పటినుంచే ఇయర్ ఎండింగ్ సెలెబ్రేషన్స్ ని మొదలు పెట్టేసింది. ఈ కాన్సెప్ట్ తో "మోస్ట్ అవైటెడ్ దావత్..మ్యాడ్" పేరుతో ఒక ఈవెంట్ స్టార్ మాలో రాబోతోంది. ఇందులో బ్రాహాముడి సీరియల్ హీరో, హీరోయిన్స్ రెచ్చిపోయారు. "సీరియల్ వెర్సెస్ రియల్" థీమ్‌తో ఈ ఈవెంట్ జరిగింది. సీరియల్ సెలబ్రెటీలంతా ఒకవైపు.. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ ని మరో వైపుకు కూర్చోపెట్టి రచ్చ చేశారు యాంకర్లు రవి, వర్షిణి. ఇక ఈవెంట్‌కి "బబుల్‌గమ్" మూవీ టీమ్, "బలగం" మూవీ  హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్, ఇంద్రజ హాజరయ్యారు.

కమల్ హాసన్ మూవీకి నాని కొడుకు మ్యూజిక్...

"ఉస్తాద్..రాంప్ ఆడిద్దాం" షో ఫస్ట్ ఎపిసోడ్ గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇక ఈ షోకి నేచురల్ స్టార్ నాని ఎంట్రీ ఇచ్చాడు. ఇక మంచు మనోజ్ నానిని ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేసాడు. " నీ రియల్ లైఫ్ లో ఉస్తాద్ ఎవరు..నువ్వు యాక్టర్ కి కాకుండా డైరెక్టర్ వి ఐతే ఎవరితో మూవీ చేస్తావ్..వాళ్లకు ఎం టైటిల్ పెడతావ్" అంటూ కొన్ని ప్రశ్నలు అడిగేసరికి   "నా కొడుకు జున్ను ఆ తర్వాత ఈ ప్రేక్షకులు" అని చెప్పాడు నాని. " ఇప్పుడు వాడికి ఆరున్నరేళ్ల.. మొన్నటి వరకు వాడికి సినిమా అంటే ఏమిటి..నాన్న యాక్టర్ ఆ..ఈ లాజిక్ లన్నీ అర్దమయ్యేవి కావు. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం తెలుస్తున్నాయి..ఇప్పుడు వాడికి పియానో అంటే చాలా ఇష్టం. అది నేర్చుకుంటున్నాడు.