English | Telugu

‘కార్తీక దీపం’ వంటలక్క మిస్సింగ్.. వెతికి పెట్టండంటూ అడిగిన నెటిజన్

కొన్ని నెలల క్రితం వరకు స్టార్ మాలో ప్రసారమైన కార్తీక దీపం సీరియల్ మస్త్ ఫేమస్ అయ్యింది. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఈ మూడు క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతూనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త సెన్సేషన్ సృష్టిస్తూ ఉండేది ఈ సీరియల్. వంటలక్కగా ప్రేమి విశ్వనాధ్ నటన అద్భుతః అనే ఆడియన్స్ చాల ఎక్కువ. ఇక సీరియల్ ఐపోయినా కూడా నిరుపమ్ పరిటాలను డాక్టర్ బాబు అనే పిలుస్తూ ఉంటారు. ఇక ప్రేమి విశ్వనాధ్, నిరుపమ్ జోడీగా కార్తీక దీపం సీక్వెల్ ఉంటుందని అప్పట్లో టాక్ వచ్చింది కానీ దాని గురించి అసలు ఇంతవరకు అప్ డేట్ ఏమీ లేదు. ఇక ప్రేమి విశ్వనాధ్ మాత్రం సీరియల్ ఐపోయిన తరువాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.