English | Telugu

శివాజీకి షాకిచ్చిన కొడుకు రిక్కీ.. అతన్ని గెలిపించండి అంటూ రిక్వెస్ట్!

బిగ్ బాస్ సీజన్-7 కథ క్లైమాక్స్ వచ్చింది. హౌస్ లో‌ఎన్నో గొడవలు, ఎన్నో టాస్క్ లు ఎంతోమంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్ళి, వచ్చారు. ఇక గతవారం శోభాశెట్టి ఎలిమినేషన్ అవ్వడంతో హౌస్ లో ప్రశాంత్, శివాజీ, అర్జున్, యావర్, అమర్ దీప్, ప్రియాంక జైన్ మాత్రమే ఉన్నారు. దాంతో ఈ ఆరుగురిలో టైటిల్ గెలిచేదెవరనే ఆసక్తి అందరిలో నెలకొంది.

అయితే హౌస్ లో ఉన్నవారిలో ఎవరు విజేత అవ్వాలని భావిస్తున్నారో వారికి ఓటు వేయండి అని కంటెస్టెంట్స్ కి ఇచ్చిన నెంబర్ లకి మిస్డ్ కాల్ ఇస్తూ ఒక ఓట్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆప్ లో మరో ఓట్ ని వేసే సదుపాయాన్ని కల్పించాడు బిగ్ బాస్. దాంతో కంటెస్టెంట్స్ యొక్క అభిమానులు తమ ప్రియమైన వారికి ఓట్ చేస్తున్నారు‌. అయితే వీరిలో రైతుబిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ నెంబర్ కి కాల్ చేస్తుంటే కలవట్లేదనే మొన్నటి నుండి సాగుతుంది. అయితే ఇది కావాలనే చేస్తున్నారా లేక టెక్నికల్ ప్రాబ్లమా? అని తెలియట్లేదు‌. ఇదే విషయాన్ని శివాజీ చిన్న కొడుకు రిక్కీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపాడు.

ఇప్పటి దాకా మీ శివన్నకి ఓట్ చేసి గెలిపించారు. ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి‌. మీరు చేసే ఓటింగ్ చాలా కీలకం.. ఇదే చివరి వారం. నేను ఒక ఛాలెంజ్ విసిరాను. దానికి మా నాన్న బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. నేను మార్నింగ్ 6AM నుండి ఓట్ వేయడానికి ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. మీరు ట్రై చేస్తూనే ఉండండి ఏదో ఒక టైమ్ లో ఓట్ పడుతుంది. శివన్నకి మీ సపోర్ట్ అవసరం అంటూ రిక్కీ ఈ వీడియోలో తెలిపాడు‌. ఈ వీడియో ఇప్పటికే ఫుల్ వైరల్ గా మారింది. దాంతో శివాజీతో పాటు పల్లవి ప్రశాంత్ కి ఓట్లు బాగా పడే అవకాశం ఉంది‌. మరికొన్ని రోజుల్లో బిబి ఫినాలే ఉంటుంది. కాగా ఈ బిగ్ బాస్ సీజన్-7 టైటిల్ గెలిచేదెవరనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది.