English | Telugu

Brahmamudi:రాజ్ తో  రహస్యంగా మాట్లాడిన ఆ అమ్మాయి ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ - 276 లో.. కళ్యాణ్, అనామికల పెళ్లి జరగాలని అక్కడ ఎండిపోయిన మొక్కని మారుస్తుంది కావ్య. ఉదయం మొక్కని చూసిన ఇంట్లో వాళ్ళంతా.. పచ్చగా ఉందని కళ్యాణ్, అనామికల పెళ్లి చెయ్యాలని ఫిక్స్ అవుతారు. ఆ తర్వాత కావ్య దగ్గరికి కళ్యాణ్ వచ్చి నీవల్లే ఇదంతా మొక్క మార్చడం నేను చూసాను వదిన. ఈ పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం మీరే థాంక్స్ అంటూ కళ్యాణ్ చెప్తాడు. ఆ మాటలు అన్ని కూడా రాజ్ విని కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత రాజ్ విని లోపలికి వెళ్లడం చూసిన కావ్య.. ఇప్పుడు ఎంత గొడవ చేస్తారో అని రాజ్ వెనకాలే వెళ్లిపోతుంది. కానీ రాజ్ మాత్రం తన తమ్ముడి సంతోషం కోసం ఇదంతా చేస్తున్నావని అంటాడు. మరి మీ తమ్ముడి విషయంలో చేస్తే మీకు న్యాయం అనిపించింది. నా అక్క విషయంలో చేస్తే మోసం అనిపించిందా అని కావ్య అడుగుతుంది. ఇలా ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది. మరొక వైపు అప్పుతో కళ్యాణ్ పెళ్లి ఎలా చెయ్యాలని కనకం ఆలోచిస్తుంటుంది. ఈ కనకం నిద్రపోకుంటే నాకు టార్చర్ చూపిస్తుంది. ఎలా అయినా పడుకునేలా చెయ్యాలని రుద్రాణి తను డ్రింక్ చేస్తూ కొంచెం కనకానికి జ్యూస్ అని చెప్పి తాగమని ఇస్తుంది. ఇక మందు తగిన కనకం మత్తులో రుద్రాణినిని ఒక అట ఆడుకుంటుంది. నా కూతుళ్లు ఈ ఇంట్లో ప్రశాంతంగా లేకుండా చేస్తున్నావ్ కదే అంటూ రెచ్చిపోయి రుద్రాణిని కొట్టబోతుంటే రుద్రాణి తప్పించుకొని బాత్రూమ్ లో దాక్కుంటుంది.

మరొకవైపు తను చేసిన పని గురించి దేవుడికి చెప్పుకుంటు ఉంటుంది కావ్య. ఆ ప్రేమికులని కలపాలని ఇలా చేస్తున్నానంటూ దేవుడికి మొక్కుకుంటుంది. ఆ తర్వాత రాజ్ కి శ్వేత అనే అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ కాల్ చూసి రాజ్ టెన్షన్ పడుతు.. లిఫ్ట్ చేసి ఎందుకు చేసావ్ నైట్ ఒక మెసేజ్ చేస్తే చూసుకొని ఫోన్ చేసేవాడిని కదా అంటూ రహస్యంగా మాట్లాడుతుంటే.. అప్పుడే కావ్య వస్తుంది. తనకి వినిపించకుండా కంగారుగా రాజ్ మాట్లాడతాడు. రేపు మన ఫేవరెట్ ప్లేస్ లో కలుద్దామని ఆ అమ్మాయి అనగానే రాజ్ సరే అని ఫోన్ కట్ చేస్తాడు. ఆఫీస్ కాల్ కూడా అలా నాకు వినిపించకుండా మాట్లాడాలా? ఆఫీస్ విషయలు ఎవరితో అయిన చెప్తాననా అని కావ్య అనగానే.. హమ్మయ్య వినలేదని రాజ్ అనుకుంటాడు. మరొక వైపు అనామికకి కళ్యాణ్ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. ఆ విషయం కనకం విని పెళ్లి ఎలాగైనా క్యాన్సిల్ చెయ్యాలని ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.