English | Telugu

మీ సోషల్ మీడియా అకౌంట్స్ ని చూడడానికి ఎవరినైనా పెట్టుకోండి...సోహైల్ కి సలహా

బిగ్ బాస్ సీజన్ వచ్చిందంటే చాలు ఆ సీజన్ ఎండ్ అయ్యే లోపు ఎవరో ఒకరు ఫేమస్ ఐపొతూ ఉంటారు. అలాగే ఈ 7 సీజన్స్ లో చాల మంది పాపులర్ అయ్యారు కూడా. అలాంటి ఈ గేమ్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న వారిలో సయ్యద్ సోహైల్ కూడా ఉన్నాడు. హౌస్ లో ఉన్నపుడు ఆడియన్స్  ని ఆకట్టుకున్న సోహైల్ తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చాక హీరోగా సినిమాల్లో చేస్తూ ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నాడు.  ప్రేక్షకులను ఆకట్టుకున్న సోహెల్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు, లక్కీ లక్ష్మణ్ , ఇలాంటి మూవీస్ లో నటించాడు. ఇక ఇపుడు సోహైల్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టాడు.