Brahmamudi:వాళ్ళిద్దరిని అలా చూసి షాకైన అపర్ణ.. రాజ్ బంఢారం బయటపడనుందా?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -279 లో.. దుగ్గిరాల ఇంట్లో కావ్య పూజ చేసి అందరికి హారతి ఇస్తుంది. సాయంత్రం కోనేరులో దీపం వదిలేవరకు ఎవరు ఉపవాసం వదలడానికి వీలు లేదని ఇందిరాదేవి అనగానే.. మీకు ఉపవాసం, మాకు కాదంటు సుభాష్, ప్రకాష్ టిఫిన్ చెయ్యడానికి సిద్ధం అవుతు రాజ్ ని పిలుస్తారు. అప్పుడే రాజ్ ని కావ్య అటపట్టిస్తు.. నాతో పాటు తను కూడా ఉపవాసం ఉంటానని చెప్పాడని కావ్య అనగానే రాజ్ ఏం మాట్లాడలేకపోతాడు.