English | Telugu
Guppedantha Manasu:ఇంటరాగేషన్ లో ముకుల్ కి షాకిచ్చిన శైలేంద్ర!
Updated : Dec 11, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -943లో.. ఇంటరాగేషన్ కోసం శైలేంద్ర దగ్గరికి ముకుల్ వస్తాడు. ఇక అన్ని ప్రశ్నలతో ముకుల్ శైలేంద్రని టెన్షన్ పెడుతాడు. చివరికి జగతి హత్యకి సంబంధించి రౌడీతో శైలేంద్ర ఫోన్ మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ ని వినిపిస్తాడు. అందరి ముందు ఆ వాయిస్ నీదేనా అని ముకుల్ అడుగుతాడు. నాదే అని శైలేంద్ర అనగానే.. ఎంత పని చేసావు రా అంటూ ఫణీంద్ర శైలేంద్రపై చెయ్యి చేసుకుంటాడు.
ఆ తర్వాత ఇక అన్ని నిజలు బయటపడుతాయని మహేంద్ర, వసుధారలు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇక స్టేషన్ కి వెళదామా తప్పు ఒప్పుకున్నారు కదా అని ముకుల్ అనగానే.. వస్తాను ఒక నిమిషం అంటూ మమ్మీ నా ఫోన్ తీసుకోని రా అని చెప్పగానే దేవయాని ఫోన్ తీసుకోని వస్తుంది. నేను హాస్పిటల్ లో ఉండగా నాకు ఒక ఫోన్ వచ్చింది అంటు ఒక వాయిస్ రికార్డింగ్ ని వినిపిస్తాడు. అందులో జగతి కేసు లో మీరే నిందితుడుగా ఉన్నారు. మిమ్మల్ని తప్పిస్తాను. నాకు డబ్బులు ఇవ్వండి అంటు ముకుల్ వాయిస్ తో ఆడియో ఉండడం చూసి అందరు షాక్ అవుతారు. ఆ వాయిస్ నాది కాదని ముకుల్ అంటాడు. మీరు ఇప్పుడు వినిపించింది నా వాయిస్ అయినప్పుడు ఇది మీ వాయిస్ ఎందుకు కాదని శైలేంద్ర అంటాడు. మంచికే కాదు చెడుకి కూడా టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు. ఎవరు ఈ పని చేస్తున్నారో అంటు శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత శైలేంద్రకి రిషి ఫోన్ చేసినట్లుగా మరొక రికార్డింగ్ ని శైలేంద్ర వినిపిస్తాడు. అందులో ఎండీ చైర్ లో వసుధారని కూర్చోపెట్టడానికి జగతిని తొలగించాను. ఇప్పుడు నిన్ను కూడా అడ్డు తొలగించాలని ఇలా ఎటాక్ చేసానని రిషి మాట్లాడినట్టుగా ఆ వాయిస్ రికార్డింగ్ ఉంటుంది. రిషి అలాంటి వాడు కాదని మహేంద్ర అంటాడు. రిషి అలాంటి వాడు కాదని నాక్కూడా తెలుసు. ఎవరో మన కుటుంబంపై ఇలా చేస్తున్నారు. నాపై ఎటాక్ చేసినప్పుడు.. మీ కుటుంబంలో ఎవరిని వదిలి పెట్టానంటూ చెప్పి వెళ్ళారని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత రిషి అసలు ఎక్కడ ఉన్నాడో? బ్రతికి ఉన్నాడో? లేదో అనగానే వసుధార కోపంగా.. ఆపండి ఇంకొసారి రిషి సర్ గురించి అలా మాట్లాడకండి. రిషి సార్ కీ ఏమైనా అయితే ఎవరిని వదిలి పెట్టనని వసుధార వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ముకుల్ అన్ని విషయలు కనుక్కుంటాను. మీకు వచ్చిన ఫోన్ కాల్స్ గురించి ఎంక్వయిరీ చేస్తానంటూ చెప్పి ముకుల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత వసుధార, మహేంద్ర.. ఇంత నాటకం ఆడిన శైలేంద్ర గురించి మాట్లాడుకుంటారు. ముకుల్ కి నిజం తెలిసిపోయిందని ఇదంతా డ్రామా క్రియేట్ చేసాడని అనుకుంటారు. రిషి సర్ ఇంకా రాలేదని వసుధార టెన్షన్ పడుతు ఉంటుంది. మరొక వైపు దేవయాని హ్యాపీగా శైలేంద్ర దగ్గరికి వెళ్లి... ఏం ప్లాన్ చేశావ్ నాన్న అంటూ మెచ్చుకుంటుంది. అప్పుడే ధరణి డోర్ కొడుతుంది. దేవయాని వెళ్లి డోర్ తియ్యగానే ధరణి కోపంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.