English | Telugu

పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ గా ఆట సందీప్ భార్య!

బిగ్ బాస్ హౌస్ లోకి రైతుబిడ్డగా అడుగుపెట్టిన
పల్లవి ప్రశాంత్ కి రోజు రోజుకి సెలబ్రిటీల సపోర్ట్ పెరుగుతుంది. నిన్న మొన్నటి వరకు అఖిల్ సార్థక్, ఫైమా, సమీర్ లాంటి వాళ్ళు పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేయగా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-7 కంటెస్టెంట్ ఆట సందీప్, అతని భార్య జ్యోతి రాజ్ సపోర్ట్ చేస్తున్నారు.

హౌస్ లో జెన్యున్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే మొదట శివాజీ, ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో చెప్పింది జ్యోతి‌. ఆటల్లో ప్రాణం పెట్టి ఆడుతూ చాలా కష్టపడుతూ టైటిల్ కి అతి తక్కువ దూరంలో ఉన్న అతనికి సపోర్ట్ చేయండి అంటూ పల్లవి ప్రశాంత్ గురించి చెప్పింది జ్యోతి . బిగ్ బాస్ సీజన్-7 తుదిదశకు చేరుకుంది. హౌస్ లో ఎవరేంటని ఇప్పటికే అందరికి తెలిసిపోయింది. అయితే టాప్-3 ఎవరనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది.

ఆట సందీప్ హౌస్ లో‌ ఉన్నప్పుడు అతని భార్యకి, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కి మధ్య పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యాక ఎవరేంటని, ఎవరు గ్రూప్ గా ఆడుతున్నారో? ఎవరు జెన్యున్ గా ఆడుతున్నారో తెలుసుకున్నారు. శోభాశెట్టి, ప్రియాంక, అమర్ దీప్ ల గ్రూపిజం స్ట్రాటజీలో ఆట సందీప్ , టేస్టీ తేజ బలైయ్యారనే లేట్ గా తెలుసుకున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్నవారిలో టాస్క్ లలో ఫెయిర్ గా ఆడేది, ఉండేది‌‌ శివాజీ, ప్రశాంత్, యావర్ అని బిగ్ బాస్ అభిమానులందరికి తెలిసింది. ఇక వందలో 85 శాతం జనాలు ఈ ముగ్గురికి సపోర్ట్ చేస్తుండటంతో ఇప్పుడు ఆట సందీప్, అతడి భార్య నిజమేనని గ్రహించి పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేయండి అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో వీడియో అప్లోడ్ చేసింది. ఇక ఈ పోస్ట్ కి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ థాంక్స్ ఫర్ ది సపోర్ట్ అంటు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.