English | Telugu
ప్రొడ్యూసర్ గా కార్తీక దీపం డాక్టర్ బాబు
Updated : Dec 10, 2023
యష్-వేద అంటే చాలు "ఎన్నెన్నో జన్మల బంధం" సీరియల్ గుర్తు రాక మానదు. ఇక ఈ సీరియల్ లో వీళ్ళ కెమిస్ట్రీకి తెలుగు ఆడియన్స్ ఫుల్ ఫిదా ఇపోయారు. ఇక ఈ సీరియల్‌కి ఎండ్ కార్డు పడిపోయాక ఫ్యాన్స్ అంతా బాధపడుతున్నారు. వీళ్ళ జంటను మళ్ళీ చూస్తామా చూదామా అనుకుంటున్నా ఆడియన్స్ కి స్టార్ మా గుడ్ న్యూస్ చెప్పేసింది. అదే "సత్యభామ" సీరియల్ ని లాంచ్ చేసేసింది. ఇందులో వేద కనిపించేసరికి యష్ కూడా ఉంటే బాగుంటుంది అంటూ కోరుకున్న తెలుగు ఆడియన్స్ కల నెరవేర్చింది స్టార్ మా. ఈ ఇద్దరి స్టార్ కాస్ట్ ఈ సీరియల్ లో మళ్ళీ రిపీట్ కాబోతోంది. ఇప్పుడు "సత్యభామ" సీరియల్ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. "ఎన్నెన్నో జన్మల బంధం" సీరియల్ టైమింగ్స్ లోనే "సత్యభామ" సీరియల్ ని ప్రసారం చేస్తోంది స్టార్ మా.
అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ రాత్రి 9.30 గంటలకు సత్యభామ సీరియల్ ప్రసారం కాబోతోంది. అంటే బిగ్‌బాస్ ఐపోయిన తర్వాతి రోజు నుంచే డిసెంబర్ 18 నుంచి యష్, వేద ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అన్న మాట. ఈ సీరియల్‌లో వేద.. సత్యభామగా, చదువుల బిడ్డగా ఎప్పుడూ పుస్తకాలు పట్టుకునే అందమైన అమ్మాయిగా కనిపిస్తుందన్నమాట.
ఇక యష్ మాత్రం రౌడీ గెటప్‌లో తప్పు చేసే వాళ్ళను ఇరగొట్టే క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. ఇక వీరిద్దరికీ మధ్య సాగే ప్రేమ కథే ఈ సత్యభామ. ఈ సీరియల్‌కి కార్తీక దీపం డాక్టర్ బాబు అలియాస్ పరిటాల నిరుపమ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. నిరుపమ్ ఓం ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ ద్వారా ఈ సీరియల్‌ను ప్రొడ్యూస్ చేశాడు. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రేమ, పల్లకిలో పెళ్లికూతురు, హిట్లర్ గారి పెళ్లాం వంటి హిట్ సీరియల్స్ రిలీజ్ అయ్యాయి. ఈ సీరియల్‌ను పోస్టర్స్ ని నిరుపమ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.