English | Telugu

శివాజీకి సపోర్ట్ గా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్!


బిగ్ బాస్ సీజన్-7 ఫినాలేకి చేరుకుంది. మరో వారం వారం రోజుల్లో పూర్తవబోతున్న బిగ్ బాస్ లో టైటిల్ గెలిచేదెవరనే ఆసక్తి అందరిలో ఉంది. ప్రస్తుతం హౌస్ లో శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్ దీప్, ప్రియాంక, అర్జున్ ఉండగా.. నిన్నటి ఎపిసోడ్ లో ఆ అరుగురిని ఫైనలిస్టులుగా నాగార్జున ప్రకటించాడు.

అయితే ప్రతీ సీజన్ గ్రాంఢ్ ఫినాలేలో ఉండేది టాప్-5 కాబట్టి ఈ ఆరుగురిలో ఎవరినో‌ ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటకు పంపిస్తారనే టాక్ నడుస్తోంది. అయితే హౌస్ లో ఉన్నవారికి బయట చాలామంది ప్రేక్షకులు సపోర్ట్ చేస్తున్నారు. వీరిలో సెలబ్రిటీలు హీరో, హీరోయిన్, యాంకర్స్ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్ శ్రీసత్య తన సపోర్ట్ శివాజీకి అని చెప్తూ ఓ వీడియోని తన ఇన్ స్ట్రాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.

ఇందులో శ్రీసత్య ఏం అందంటే.. " బిగ్ బాస్ సీజన్-7 నిజంగా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. నా ఫేవరెట్ ప్లేయర్ వచ్చేసి శివాజీ గారు. అతను నిజంగానే చాణక్యుడిలాగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. నాకు ఆ స్ట్రాటజీలు చాలా నచ్చాయి. ఆయన స్టాండ్ తీసుకున్న విధానం గానీ, గేమ్ గానీ బాగుంది. ఫినాలేకి ఓటింగ్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఉల్టా పుల్టాగా ట్విస్ట్ లతో ఆసక్తికరంగా సాగుతుంది. ప్లీజ్ సపోర్ట్ జెన్యున్ ప్లేయర్ శివాజీ గారు. ప్లీజ్ ఓట్ శివాజీ గారు" అంటూ శ్రీసత్య ఈ వీడియోలో చెప్పుకొచ్చింది.

శ్రీసత్య సీజన్-6 లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో మొదటి నాలుగు వారాలు ఏదో పిక్ నిక్ కి వచ్చినట్టుగా ఉండేది. అందరి ఆటను చూడ్డానికే వచ్చాను తప్ప ఆడటానికి కాదన్నట్లుగా ప్రవర్తించింది. ఆమె బిహేవియర్‌ చూసి హౌస్‌మేట్సే కాదు నాగార్జున సైతం తిట్టిపోశాడు. దీంతో మెల్లిగా తనను తాను మార్చుకుంటూ నెమ్మదిగా రంగంలోకి దిగి దెబ్బలు తగిలినా సరే ఆట వదిలేదే లేదన్నట్లుగా గేమ్‌ ఆడటం ప్రారంభించింది.

అయితే ఇతరుల నామినేషన్స్‌ చూసి ఎగతాళి చేసినట్లుగా నవ్వడం, వెటకారం, రేవంత్‌ గురించి వెనకాల మాట్లాడటం ఇలా కొన్ని తప్పుల వల్ల ఆమెపై విపరతీమైన నెగెటివిటీ ఏర్పడింది. ఆ తర్వాత ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ నాన్న వచ్చినపుడు బయట జరిగేదంతా చెప్పడంతో తన ఆటతీరుని మార్చుకొని ఫినాలేకి ఒక వారం ముందు ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. అయితే శ్రీసత్య అనగానే అర్జున్ కళ్యాణ్ గుర్తొస్తాడు. ఎందుకంటే ఆ సీజన్ లో శ్రీసత్య కోసమే అర్జున్ కళ్యాణ్ హౌస్ లోకి వచ్చాడని, తనతో కొన్నిరోజులైన కలిసి ఉండొచ్చని భావించాడంట. అయితే ఇప్పుడు శ్రీసత్య మాత్రం తన సపోర్ట్ శివాజీకే అంటు చాలా ఇంటర్వ్యూలలో చెప్తూ ఉంది‌. ఒక జెన్యున్ అండ్ ఫెయిర్ ప్లేయర్ కి సపోర్ట్ చేయండి అంటు శ్రీసత్య తన మద్దతుని తెలుపుతుంది.