English | Telugu

శోభాశెట్టి ఎలిమినేషన్ కి కారణాలు?.. స్టేజ్ మీదే ఏడ్చేసింది!

బిగ్ బాస్ సీజన్-7 పద్నాలుగు వారాలు పూర్తిచేసుకుంది. ఆదివారం నాటి ఎపిసోడ్ లో శోభాశెట్టి ఎలిమినేట్ అయింది. దీంతో హౌస్ లో అరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. వీళ్ళు గ్రాంఢ్ ఫినాలేకి అర్హత సాధించారు.

సండే ఫన్ డే కావడంతో నాగార్జున కొన్ని ఫన్ టాస్క్ లతో మొదలెట్టాడు. ఇక హౌస్ లో ఉన్నవారిలో మొదటి ఫైనలిస్ట్ అంబటి అర్జున్ కాగా , రెండవ ఫైనలిస్ట్ కోసం అందరికి యాక్టివిటి ఏరియాకి పిలిచాడు నాగార్జున. అక్కడ ఉన్న హాలోగ్రామ్ లో ప్రియాంక ఫోటో రావడంతో సెకెండ్ ఫైనలిస్ట్ గా తను కన్ఫమ్ అయింది. ఇక మూడవ ఫైనలిస్ట్ గా యావర్, నాల్గవ ఫైనలిస్ట్ గా అమర్ దీప్ సెలెక్ట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఆస్కార్ విజేత మ్యూజిక్ బ్రహ్మ కీరవాణి స్టేజ్ మీదకి వచ్చేశారు. వచ్చీరాగానే నాగార్జున గారితో తన జ్ఞాపకాలు పంచుకున్నాడు. ఇక నాగార్జున అప్ కమింగ్ మూవీ ' నా సామి రంగ' కి కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నట్టు చెప్పి.. ఒక లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇది చూసిన హౌస్ మేట్స్ విజిల్స్ కేకలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక హౌస్ మేట్స్ అందరిని కీరవాణి గారికి నాగార్జున ‌పరిచయం చేశాడు. ఇక పల్లవి ప్రశాంత్ ఒక కవిత చెప్పి ఆకట్టున్నాడు. ఆ తర్వాత మరొక ఫైనలిస్ట్ ని కీరవాణి చేతుల మీదుగా చేసాడు నాగార్జున. గార్డెన్ ఏరియాలో కొన్ని బాల్స్ తో ఉన్న బోర్డ్ ఉంది. అర్జున్, అమర్ ఇద్దరు కలిసి ఓపెన్ చేయగా అందులో ప్రశాంత్ ఫోటో రావడంతో తను అయిదవ ఫైనలిస్ట్ గా సెలెక్ట్ అయ్యాడు.

ఇక ఆ తర్వాత మిగిలిన శివాజీ, శోభాశెట్టి లని అక్కడే ఉండమని హౌస్ మేట్స్ అందరికి హాల్లోకి వచ్చేయమన్నాడు నాగార్జున. ఇక శివాజీ, శోభాశెట్టి లకి రెండు హౌజీ(తంబోల) చీటీలని ఇచ్చాడు. నాగార్జున ఒక్కో నెంబర్ చెప్తుంటే వాళ్ళకొచ్చిన చిట్టీలో ఆ నెంబర్ ని పోక్ చేయాలని చెప్పాడు . ఎవరిది పూర్తిగా అవుతుందో వారు సేఫ్, మిగిలిన వారు ఎలిమినేషన్ అని చెప్పగా.. శివాజీ గెలిచి అయిదవ ఫైనలిస్ట్ గా సెలెక్ట్ అయ్యాడు . శోభాశెట్టి ఎలిమినేట్ అయింది.‌ ఇక హౌస్ లో‌ అందరికి బై చెప్పేసి‌ స్డేజ్ మీదకి వచ్చేసింది శోభా. అక్కడ నాగార్జున తన జర్నీ వీడియోని చూసి ఎమోషనల్ అయింది. గుడ్ క్వాలిటీ, బ్యాడ్ క్వాలిటీ చెప్పమని చెప్పగా అందరికి గురించి శోభాశెట్టి పాయింటాఫ్ లో చెప్పింది. ఆ తర్వాత శోభాశెట్టిని పంపించేసాడు. ఆ తర్వాత హౌస్ లో మిగిలిన ఆరుగురికి కంగ్రాట్స్ మీరే ఫైనల్ వీక్ లో ఉండేది అని నాగార్జున చెప్పడంతో వాళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేశారు.