English | Telugu
శోభాశెట్టికి 30 లక్షలు ఇచ్చిన బిగ్ బాస్... ఎందుకో తెలుసా!
Updated : Dec 10, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో మోస్ట్ అన్ డిజర్వింగ్ కంటెస్టెంట్ శోభాశెట్టి ఎలిమినేట్ అయింది. దీంతో హౌస్ లోని వాళ్ళంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రేక్షకులైతే సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఎక్కడ చూసిన శోభాశెట్టి ఎలిమినేషన్ అయిందని, ఇక నుండి బిగ్ బాస్ ని హ్యాపీగా చూడొచ్చని అంటున్నారు.
శోభాశెట్టిని ఎలిమినేట్ చేయాలంటూ గత కొన్నివారాలుగా ఆడియన్స్ తనకి అసలు ఓట్లే వేయకుండా లీస్ట్ లో ఉంచినా బిగ్ బాస్ సేవ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక శోభాశెట్టి ఎలిమినేషన్ కోసం ఎదురుచూసి, చూసీ జనానికి చిరాకు వచ్చేసింది. ఎంత చిరాకు వచ్చిందంటే.. ఫినాలే వీక్‌లో మొత్తానికి ఓట్లు వేయడమే మానేస్తున్నారు. శోభాశెట్టి వరుస సేవింగ్‌లతో ఎలిమినేషన్, ఓటింగ్‌లపై జనానికి నమ్మకం పోయింది. మనం ఓట్లేసిన బిగ్ బాస్ వాటిని లెక్కలోకి తీసుకోడుగా, అలాంటప్పుడు ఓట్లేసి ప్రయోజనం ఏముందని ఫినాలే వీక్‌లో ఓట్లు వేయడానికి జనం ఇష్టపడటం లేదు. ప్రతీ సీజన్‌లో అయితే.. పోటీ పడి ఓట్లు గుద్దేవారు చివరి వారాల్లో కానీ శోభాదెబ్బకి ఓట్లు వేయడానికి బిగ్ బాస్ రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. ఇక శోభాశెట్టి ఎలిమినేషన్ అయిందని వినగానే బిగ్ బాస్ ఆడియన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేసుకుంటున్నారు.
శోభాశెట్టి హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రియాంక, అమర్‌దీప్, టేస్టీ తేజలతో ఎక్కువ సమయం ఉంది. ఇక టేస్టీ తేజ బయటకొచ్చాక అమర్, ప్రియాంకలతో కలిసి గ్రూప్ హా గేమ్ ఆడుతూ మిగిలిన హౌస్ మేట్స్ అందరిని టార్గెట్ చేయడం, వారితో గొడవకి దిగడం, కావాలని ట్రిగ్గర్ చేయడం, నోరేసుకొని పడిపోవడం లాంటివి చేయడంతో శోభాశెట్టిపై జనాలకి చిరాకేసింది. దాంతో నిన్నటి ఎపిసోడ్ లో శోభాశెట్టి ఎలిమినేట్ అయింది. ఇక శోభాశెట్టి హౌస్ లో పద్నాలుగు వారాలు ఉంది. శోభాశెట్టి రెమ్యునరేషన్ రోజుకి 35 వేలు చొప్పున వారానికి 2 లక్షల 50 వేల వరకు తీసుకుందంట. ఇక హౌస్ లో ఉన్న పద్నాలుగు వారాలకి గాను 30 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునట్టుగా తెలుస్తోంది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో మోనిత శకం ముగిసింది.