English | Telugu

ఏమిటో బిగ్ బాస్ సెలబ్రిటీస్ అంతా తిరుమలకు చెక్కేస్తున్నారు

బిగ్ బాస్ సీజన్ 6  సెలబ్రిటీస్ అంతా కూడా గ్రూప్ గా తిరుమల వెళ్లి ఆ శ్రీవారిని దర్శనం చేసుకుని వస్తున్నారు. అదేంటో తెలీదు కానీ నిన్న గీతూ, శ్రీ సత్య వెళ్లారు. ఇక ఇప్పుడు ఇద్దరూ వెళ్లారు. ఇక ఈ పిక్స్ ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు. "ఓం నమో వెంకటేశాయ" అని టాగ్ పెట్టుకున్నారు కూడా...అర్జున్ కళ్యాణ్ నార్మల్ కాస్ట్యూమ్ లో కనిపించగా ఆర్జె సూర్య మాత్రం సాంప్రదాయక దుస్తుల్లో కనిపించారు. ఇక వీళ్ళ పిక్స్ ని చూసిన నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇదే బిగ్ బాస్ సీజన్ లో తన అందమైన ముఖంతో, నవ్వుతో, అద్భుతమైన హెయిర్ స్టైల్ తో  అందరినీ మెస్మోరైజ్ చేసిన వాసంతి కృష్ణన్ కూడా కామెంట్ చేసింది.

పోలీస్ గెటప్ లో  దర్శనం ఇచ్చిన జగతి మేడం

జ్యోతి రాయ్ అంటే ఇప్పుడిప్పుడే కొంతమందికి తెలుస్తోంది ఆమె హాట్ పిక్స్ ద్వారా..కానీ గుప్పెడంత మనసు జగతి మేడం అంటే అందరికీ బాగా తెలుస్తుంది. అలాంటి జ్యోతి ఇప్పుడు రీసెంట్ గా ఒక పోలీస్ డ్రెస్ లో ఉన్న పిక్ ని పోస్ట్ చేసింది. ఆ లుక్ ఫుల్ గా వైరల్ అవుతోంది. "అండర్ వరల్డ్ బిలియనీర్స్" పేరుతో ఒక వెబ్ సిరీస్ సిరీస్ చేసింది జగతి మేడం. యాక్షన్ థ్రిల్లర్ గా డిఫరెంట్ కథా కథనంతో  రూపొందిన ఈ సిరీస్ యొక్క ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రలో చేస్తుండగా  రాధిక - ప్రీతి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సీరీస్ లో మధుసూధన్ ,జ్యోతి రాయ్ ,షవర్ అలీ,అలోక్ జైన్, లీనా కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.