English | Telugu
Guppedantha Manasu:జగతిని చంపింది శైలేంద్రే అని తెలుసుకున్న అనుపమ.. ఏం చేయనుంది?
Updated : Dec 12, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -944 లో ముకుల్ చేసిన ఇన్వెస్టిగేషన్ తప్పని శైలేంద్ర డ్రామా క్రియేట్ చెయ్యడంతో ఇక ఎవరికి ఏది నమ్మాలో అర్థం కాదు. ఆ తర్వాత దేవయాని, శైలేంద్ర తమ ప్లాన్ సక్సెస్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అప్పుడే ధరణి వచ్చి ఆ వాయిస్ రికార్డింగ్ లో ఉన్నది మీరే కాదా అని అడుగుతుంది. అవును నేనే కానీ ఇప్పుడు మారిపోయానని శైలేంద్ర నటన మళ్ళీ మొదలుపెడతాడు.
ఆ తర్వాత శైలేంద్ర, దేవాయని ఇద్దరు ఎంత నటించిన ధరణి నమ్మదు. వాళ్లపై కోపంగా బయటకు వెళ్తుంది. ధరణి నమ్మట్లేదని దేవాయని అనగానే.. తనని ఎలా నమ్మించాలో నాకు తెలుసని శైలేంద్ర అంటాడు. మరొకవైపు జగతి ఇన్వెస్టిగేషన్ గురించి ముకుల్, అనుపమ మాట్లాడుకుంటారు. ఈ కేసు ప్రధాన నిందితుడు శైలేంద్ర అని ముకుల్ అంటాడు. మీకేలా తెలుసు అంటూ అనుపమ అడుగుతుంది. ఆధారం దొరికిన వెంటనే తనపై ఎటాక్ జరగడమేంటి? మళ్ళీ ఇప్పుడు రిషి కన్పించకుండా పోవడమేంటి? అంత ఒక పజిల్ లా ఉంది. ఎలాగైనా ఈ కేసుకి సంబంధించిన నిందితులని పట్టుకుంటానని ముకుల్ అంటాడు. ఈ కేసుకి సంబంధించి ఏదైనా కావాలంటే నా ఇన్ ఫ్లుయెన్స్ ఉపయోగిస్తానని అనుపమ చెప్తుంది. మరొకవైపు తనకు తానే ఎటాక్ చేయించుకున్న శైలేంద్ర.. ఎటాక్ చేసిన రౌడీలతో మాట్లాడుతుంటే దూరంగా ఉండి వింటుంది. మీరు చాలా బాగా చేశారు. నేను చెప్పినట్టు నాపై ఎటాక్ చేశారని ఆ రౌడీలతో శైలేంద్ర మాట్లాడుతూ.. వాళ్ళకి డబ్బులు ఇవ్వడాన్ని ధరణి చూసి షాక్ అవుతుంది.
మరొకవైపు రిషి గురించి మహేంద్ర, వసుధార ఆలోచిస్తుంటారు. అప్పుడే ధరణి కంగారుగా వసుధార, మహేంద్ర దగ్గరికి వచ్చి... ఆ వాయిస్ రికార్డింగ్ లో ఉన్న వాయిస్ మా అయన శైలేంద్రదని అనగానే ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత శైలేంద్ర చేసిన తప్పుల గురించి చెప్తూ.. ఈ ఎటాక్ కూడా తనే చెప్పించుకున్నాడు. ఇందాక ఆ ఎటాక్ చేసిన రౌడీలతో మాట్లాడుతుంటే విన్నానని ధరణి చెప్తుంది. అప్పుడే అనుపమ వచ్చి ధరణి మాటలు విని.. నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది. నిజమే అంటు ఎండీ చైర్ కోసం ఇదంతా శైలేంద్ర చేస్తున్నాడని ధరణి చెప్తుంది. ఇన్ని రోజులు జగతిని ఎవరు చంపారంటూ అడిగావ్ కదా? ఇప్పుడు తెలిసిందా అని అనుపమతో మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.