English | Telugu
రిషి సర్ తిరిగి వస్తాడా ? రోల్ ని రీప్లేస్ చేస్తారా ? డైలమాలో ఆడియన్స్
Updated : Dec 13, 2023
గుప్పెడంత మనసు సీరియల్ అంటే చాలు రిషి సర్ అలియాస్ ముఖేష్ గౌడనే అందరికీ గుర్తొస్తాడు..అందమైన మాష్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి రిషి సర్ క్యారెక్టర్ ని దాచి పెట్టేసి రెండు వారాలుగా సీరియల్ ని నడిపించేస్తున్నారు. ఈ విషయాన్నీ మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే జగతి అలియాస్ జ్యోతి రాయ్ క్యారెక్టర్ ని చంపేశారు.. ఆమె మూవీస్ లో నటిస్తున్న కారణంగా ఈ రోల్ ని త్వరగా ముగించేశారు.
అలాగే రిషి రోల్ ని కూడా ముగించేసినట్టేనా అంటూ ఫాన్స్ అనుమానిస్తున్నారు. రీసెంట్ గా మరో సీరియల్ "కృష్ణ ముకుంద మురారీ" లో కూడా మురారీని మార్చేశారు... అసలైన క్యారెక్టర్ కి యాక్సిడెంట్ అయ్యేలా చేసి ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీ చేసేసి కొత్త మనిషి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేసారు. ఇవన్నీ చూస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆడియన్స్ లో కూడా ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. ఐతే ఇంకో విషయం ఏంటంటే ముఖేష్ గౌడ.. గుప్పెడంత మనసు సీరియల్ తో సంపాదించుకున్న క్రేజ్‌తో బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయ్యాడు... ఆయన హీరోగా ‘గీతా శంకరం’ అనే మూవీ త్వరలో రాబోతోంది.
ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ముఖేష్ గౌడ సరసన.. ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఐతే ఈ మూవీ నవంబర్ నుంచి షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ కోసమే ముఖేష్ గౌడ.. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌కి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక సీరియల్ కి డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ప్రస్తుతానికి ఈ క్యారెక్టర్ కి సంబందించిన కథలో చేంజెస్ చేసి రిషిని తప్పించినట్టు తెలుస్తోంది. ఐతే మూవీ షూటింగ్ పూర్తయ్యాక సీరియల్ లో చేస్తాడా..లేదంటే ఈ రిషి సర్ ప్లేస్ ని ఎవరితో ఐనా రీప్లేస్ చేస్తారా అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.