English | Telugu
Brahmamudi:శుభలేకకి నిప్పు.. వారి పెళ్ళిలో మరో ముప్పు...!
Updated : Dec 12, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -277 లో... అనామికకి కళ్యాణ్ ఫోన్ చేసి.. ఇంటికి రమ్మని చెప్తాడు. ఆ విషయం వెనకాల ఉన్న కనకం వింటుంది. అదే విషయం కనకానికి కళ్యాణ్ చెప్తాడు. మొక్క విషయంలో నా ప్లాన్ ఫెయిల్ అయింది. ఈ సారి సరిగ్గా ప్లాన్ చెయ్యాలని కనకం ఆలోచిస్తుంది. ఇక అనామిక వాళ్ళు ఇంటికి వచ్చి తాంబులాలు మర్చుకున్నట్లు కుంకుమభరని కనకం కిందపడిపోయినట్లు, ఇక అపశకునమని పెళ్లి కాన్సిల్ చేసినట్లు కనకం ఓ కల కంటుంది.
కాసేపటికి అప్పు వచ్చి పిలవగానే.. ఇదంతా కల కన్నానా అని అనుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి సరిగ్గా టైమ్ కీ వచ్చావంటూ అప్పు చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. మరొక వైపు ఇంట్లో అందరు బిజీగా ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నవని రుద్రాణిని రాహుల్ అడుగుతాడు. మనకి ఆ స్వప్నని కోడలుగా చేసి వాళ్ళు మాత్రం మంచి ఇంటి నుండి సంబంధం తెచ్చుకుంటున్నారు. నాకు దక్కని అనందం ఎవరికి దక్కడానికి వీలు లేదని రుద్రాణి అంటుంది. ఎలాగు దోషం ఉందని చెప్పారు కదా, ఇప్పుడు ఏం జరిగిన దాని వల్లే జరిగిందని అనుకుంటారు. అది మనం చెయ్యకూడదు కావ్య వల్లే జరిగిందని అనేలా చెయ్యాలని రాహుల్ తో ఒక ప్లాన్ చెప్తుంది రుద్రాణి. మరొకవైపు అనామిక పేరెంట్స్ దుగ్గిరాల ఇంటికి వస్తారు. ఇరు కుటుంబాలు తాంబులాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక కనకం ఉహించుకున్నట్లుగానే కుంకుమభరని కిందకి పడేయ్యబోతుంటే ధాన్యలక్ష్మి చూసి కిందకి పడకుండా పట్టుకుంటుంది. ఆ తర్వాత మొదట శుభలేకని దేవుడి దగ్గర పెట్టి కావ్య పూజ చేస్తుంటుంది. అయితే దీనికి ముందు.. శుభలేకకి పెట్టిన పసుపులో ఏదో మందు కలుపుతుంది రుద్రాణి. ఇక కావ్య పూజ చేసి.. శుభలేకతో హారతి ఇస్తుండగా మంట అంటుకుంటుంది. దాంతో అందరు కంగారుపడతారు శుభలేకకి ఉన్న మంటని కావ్య ఆర్పుతుంది . ఆ తర్వాత ఎందుకు ఇలా చేసావంటు కావ్యని రుద్రాణి తిడుతుంది.
అది విని అనామిక పేరెంట్స్ కూడా కావ్యనే తప్పు పడుతారు. నీ అజాగ్రత్త వల్ల ఏం జరిగిన.. అది నా కూతురు దోషం వల్లే అయిందని అనుకుంటారనే ఇదంతా చేసావా? ఇందాక మీ అమ్మా కుంకుమభరిని పడేయబోతే ధాన్యలక్ష్మి పట్టుకుంది. అసలు ఈ అమ్మయికి ఈ పెళ్లి ఇష్టం లేదు కావచ్చని కావ్యని అనామిక వాల్ల అమ్మ అనగానే.. అలా అనకండి అని కళ్యణ్ అంటాడు. అప్పుడే కళ్యాణ్ ఏదో చెప్పబోతుంటాడు. తరువాయి భాగంలో.. ఇంత ఆస్తులు ఉన్నా రాజ్ జీవితం లో పెళ్లి కాకముందు అతని జీవితంలో ఏ అమ్మాయి ఉండకపోవడం నీ అదృష్టమని కావ్యతో కనకం చెప్తుంది. అవునని కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొక వైపు శ్వేత అనే అమ్మాయిని రాజ్ రహస్యంగా కలుస్తాడు. ఆ అమ్మయిని కౌగిలించుకొని.. నీకు నేను ఉన్నానని ఎప్పటికి మర్చిపోకు శ్వేత అని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.