English | Telugu

Brahamamudi: అప్పు ఉపవాసం.. రాజ్ లైఫ్ లోని ఆ అమ్మాయి ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -278 లో... అనామిక, కళ్యాణ్ ల మొదటి శుభలేక కాలిపోవడం చూసి ఇదంతా కావ్య కావాలనే చేసింది. ఈ పెళ్లి తనకి ఇష్టం లేదని అనామిక తల్లి అంటుంది. దాంతో మా వదిన అలాంటిది కాదని కళ్యాణ్ కావ్య సపోర్ట్ చేస్తు మాట్లాడతాడు. ఆ తర్వాత కళ్యాణ్ , అనామికల పెళ్లి జరగాలని కావ్యే మొదటి నుండి సపోర్ట్ చేసింది. అలా కావాలని చెయ్యదని రాజ్ అంటాడు.

ఆ తర్వాత ఇదంతా అనుకోకుండా జరిగింది. దీన్ని వదిలేయండి. పెళ్లి తర్వాత మీ అమ్మాయికి ఈ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని రాజ్ చెప్పగానే.. అనామిక పేరెంట్స్ రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత రాజ్ కి శ్వేత ఫోన్ చెయ్యగానే అక్కడ నుండి తనని కలవడానికి వెళ్తాడు. మరొకవైపు రాజ్ చాలా మంచివాడు. ఇంత ఆస్తులు ఉన్న పెళ్లికి ముందు తన జీవితంలో ఏ అమ్మయి లేదని కనకం మురిసిపోతుంది. అవును నా భర్త ఇప్పుడు ఇప్పుడే నన్ను అర్థం చేసుకుంటున్నాడని కావ్య కూడా మురిసిపోతుంది.

మరొకవైపు రాజ్ ఒక దగ్గరికి వెళ్లి శ్వేతా కోసం వెయిట్ చేస్తుంటే శ్వేత వచ్చి రాజ్ ని హగ్ చేసుకుంటుంది. ఎలా ఉన్నావని శ్వేతని రాజ్ అడుగుతాడు. ఇలాగే ఉన్నాను నా మనసు అలాగే ఉంది. ఆ ప్రేమ అలాగే ఉందని శ్వేత చెప్తుంది. నీకు ఎప్పుడు నేను తోడు ఉంటానని శ్వేతతో రాజ్ ప్రేమగా అంటాడు. మరొకవైపు కళ్యాణ్ శుభలేక కాలిపోయిన విషయం గురించి బాధపడుతు ఉంటాడు. కావ్య ఇంకా ఇంట్లో వాళ్ళు అందరు వచ్చి దాని గురించి వదిలేయ్ అని చెప్తారు. రేపు గుడికి వెళ్లి దీపం వదిలి ఉపవాసం ఉండమని ఇంట్లో వాళ్ళు కళ్యాణ్ కి చెప్తారు. ఆ తర్వాత అదే విషయం అనామికకి కళ్యాణ్ ఫోన్ చేసి చెప్తాడు. కాసేపటికి అనామిక పేరెంట్స్ కన్నింగ్ గా అలోచించి.. నువ్వు ఉపవాసం ఉన్నానని అబద్ధం చెప్పు.. కళ్యాణ్ తో పెళ్లి జరగడం కంటే నీకు ఏది ఎక్కువ కాదని వాళ్ళకి తెలిసేలా చెయ్యి. నీకు కళ్యణ్ కి పెళ్లి అయ్యాక,‌ ఆ తర్వాత కథ నేను నడిపిస్తానని అనామిక తండ్రి అంటాడు.

మరొకవైపు అప్పుకి కనకం ఫోన్ చేసి.. ఉపవాసం ఉండమని చెప్తుంది. మొదట అప్పు ఒప్పుకోదు కానీ ఆ తర్వాత అప్పు ఒప్పుకుంటుంది. తరువాయి భాగంలో.. అందరు గుడికి వెళ్తారు.‌ కళ్యాణ్, అనామికల పెళ్లి జరగాలని కావ్య నూట ఎనమిది ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకుందని రాజ్ కావాలనే అంటాడు. ఆ తర్వాత కావ్యని ఎత్తుకొని రాజ్ ప్రదక్షిణలు చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.