English | Telugu
Guppedantha Manasu : భర్తను కాపాడుకోవడానికి భార్య ఆ పని చేయగలదా?
Updated : Dec 13, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -945 లో శైలేంద్ర చేసే కుట్రలు మోసాలు చూడలేకపోతుంది ధరణి. వసుధార, మహేంద్ర దగ్గరికి ధరణి వచ్చి.. జగతిని చంపించింది తన భర్తనే అని, వాళ్ళకి తనకి తెలిసింది అంత చెప్తుంది. అది విని వసుధార మహేంద్ర ఇద్దరు షాక్ అవుతారు.. వాళ్ళతో పాటు ధరణి చెప్పేది అనుపమ కూడా వింటుంది. ఎండీ చైర్ కోసం ఇదంతా చేస్తున్నాడని ధరణి చెప్తుంది.
ఆ తర్వాత వసుధారపై తను ప్రవర్తించిన తీరుని గుర్తుకు చేసుకొని వసుధారకి అనుపమ సారీ చెప్తుంది. నీ మీద అనుమానంతో నిన్ను బాధపెట్టానని వసుధారతో అనుపమ అంటుంది. ఆ తర్వాత ధరణిని వసుధార తీసుకోని శైలేంద్ర దగ్గరికి బయలుదేరుతుంది. మరొకవైపు ధరణిని శైలేంద్ర పిలుస్తుంటాడు. ధరణి ఇంట్లో ఉండదు అప్పుడే దేవయాని వచ్చి.. ఎక్కడో ఉంటుందిలే అయిన ఈ మధ్య బాగా కలవరిస్తున్నావని దేవాయని అనగానే.. ధరణితో బాగుంటేనే కదా మనం చేసిన కుట్రలు ఎవరితో చెప్పదని శైలేంద్ర అంటాడు. ఈ మధ్య నువ్వు ఏం చేసిన చెప్పడం లేదు.. ఎటాక్ సంబంధించి చెప్పలేదు.. రిషి కన్పించకుండా పోవడానికి నువ్వేనా అని శైలేంద్రని దేవయని అడుగుతుంది. శైలేంద్ర మాత్రం కిడ్నాప్ చేసింది నేనే అని చెప్పకుండా.. రిషి గురించి ఇన్ని రోజులు టెన్షన్ పడ్డావ్ కదా ఇక వాడి వల్ల మనకేం టెన్షన్ ఉండదు. వాడు మనల్ని ఏం చెయ్యలేడని శైలేంద్ర అంటాడు.. ఆ తర్వాత శైలేంద్ర దగ్గరికి వసుధార, ధరణి వస్తారు.
నేను శైలేంద్రతో మాట్లాడాలి. నువ్వు కాసేపు బయటకు వెళ్ళు అని దేవాయనితో వసుధార అనగానే.. దేవాయని బయటకు వెళ్తుంది. మరొక వైపు మహేంద్రని అనుపమ అపార్థం చేసుకున్నందుకు సారీ చెప్తుంది. ఇక శైలేంద్రని రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పమని వసుధార అడుగుతుంది. నాకు తెలియదని శైలేంద్ర చెప్తాడు. ఆ తర్వాత నువ్వు అడగాల్సింది ఇలా కాదు.. బెగ్గింగ్ చెయ్యాలని శైలేంద్ర అనగానే.. వసుధార రిక్వెస్ట్ చేస్తూ రిషి ఎక్కడ అని అడుగుతుంది.. ఇలా కాదు అంటూ వాయిస్ పొగరు తగ్గాలని శైలేంద్ర అనగానే చేతులు జోడించి రిక్వెస్ట్ చేసి అడు