English | Telugu
మంచు మనోజ్ నిద్రపోవాలంటే అది ఉండాల్సిందే..ఛీఛీ డర్టీ ఫెలో
Updated : Dec 13, 2023
ఈటీవీ విన్ యాప్ లో కొత్త గేమ్ షో రాబోతోంది. అదే "ఉస్తాద్..రాంప్ ఆడిద్దాం". ఇక ఈ షోకి మంచు మనోజ్ హోస్ట్ గా చేస్తున్నాడు. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ కి "హాయ్ నాన్న" మూవీ నుంచి నేచురల్ స్టార్ నాని ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ షో స్టేజి మీదకు నాని ఎంట్రీ ఇచ్చేసరికి ఆడియన్స్ అంతా కలిసి కార్డు బోర్డ్స్ మీద నాని అని లెటర్స్ ని హార్ట్ సింబల్స్ లో రాసి వెల్కమ్ చెప్పారు. ఇక మంచు మనోజ్ అది చూసి షాకయ్యాడు. "ఎన్నో రకాల వెల్కమ్స్ ని చూసా కానీ ఇలాంటి వెల్కమ్ ని చూడలేదు" అన్నాడు.
ఇక ఇందులో నానికి టాస్క్ ఇచ్చాడు మనోజ్. "ఇప్పుడు నువ్వు నా నాన్నవు..నేను నీ కొడుకును..నన్ను నిద్రపుచ్చి..నువ్వు లోపలి వెళ్ళాలి" అని మనోజ్ చెప్పేసరికి "నిన్ను పడుకోబెట్టాలంటే ఫుల్ తాగించాలనుకుంటా" అంటూ ఒక సిగ్నల్ ఇచ్చాడు నాని. "నీకు అమ్మకు మధ్యలో వచ్చి పడుకున్నా" అంటూ ఒక డైలాగ్ వేసాడు మనోజ్ ..దానికి నాని "ఉండు మీ అమ్మకు ఫోన్ చేస్తున్నా" అనేసరికి "వొద్దొద్దు" అంటూ లేచి వెళ్ళిపోయాడు.
మధ్యలో ఇంకో టాస్క్ ఇచ్చాడు మనోజ్..హీరోయిన్స్ పిక్స్ చూపించి అన్ని వరసగా పెట్టమనేసరికి "నాజియా, మృణాల్ ఎవరు ముందు...మృణాల్ మధ్యలో వస్తుంది.." అనేసరికి "ఎవరి మధ్యలో" అంటూ కొంటె డైలాగ్ వేసాడు మనోజ్.."ఛిఛి డర్టీ ఫెలో" అన్నాడు నాని. ఇక చివరిలో దసరా మూవీ సాంగ్ కి డాన్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేశారు నాని, మనోజ్ . ఇక మంచు మనోజ్ ఎలా హోస్టింగ్ గురించి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. " మంచు మనోజ్ హోస్ట్ అంటే ఎలా చేస్తాడో అనుకున్నాను బాస్ ఫస్ట్ లో పర్లేదు బాగానే లీడ్ చేస్తున్నాడు హోస్ట్ గా గుడ్ .. మనోజ్ అన్న ఇంకా మారలేదు అదే కామెడీ అదే పంచెస్...మనోజ్ అన్నా షో చాలా మంచి హిట్ అవ్వాలని" ఎన్టిఆర్ ఫాన్స్ కోరుతున్నారు.