English | Telugu

ముగిసిన ఢీ ప్రీమియర్ లీగ్..75 లక్షలు గెలుచుకున్న గ్రీష్మ

ఢీ ప్రీమియర్ లీగ్ గ్రాండ్ ఫినాలే ఆడియన్స్ ని బాగా అలరించింది. ఇందులో హైదరాబాద్ ఉస్తాద్స్ గ్రీష్మమాస్టర్ వార్సెస్ సైరా రాయలసీమ ప్రభు మాస్టర్ మధ్య గట్టి పోటీ జరిగింది. అన్ని రకాల రౌండ్స్ లో ఈ రెండు టీమ్స్ పోటాపోటీగా పెర్ఫార్మ్ చేశాయి. గ్రీష్మ మాస్టర్ హీరో నాని విన్నింగ్ టైటిల్ తో పాటు కాష్ ప్రైజ్ 75 లక్షలు అందించారు. ఇక చివరిగా నాని కొన్ని మాటలు వీళ్లకు చెప్పారు. "మీరు స్క్రీన్ మీద చాలామంది డాన్స్ చేయడాన్ని చూసి చాల ఇన్స్పైర్ అయ్యి ఈ స్టేజి మీద డాన్స్ చేసి ఉంటారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా కదా మీకంటే కూడా వాళ్ళెవరూ అంత బాగా చేయలేదు. ఇక గ్రీష్మ గురించి ప్రభుదేవా మాస్టర్ కూడా కొన్ని విషయాలు చెప్పాడు "గ్రీష్మ టైటిల్ విన్ ఐనందుకు చాల సంతోషంగా ఉంది.


మేమిద్దరం కలిసి ఢీ జోడిలో చేసాం. గ్రీష్మ చాల కష్టపడుతుంది. ఇక షో స్టార్టింగ్ లో నానిని రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగాడు హోస్ట్ ప్రదీప్ "ఇంట్లో మీరు వంట చేసి ఎవరైనా తినగలిగే ఐటెం ఏమిటి" అనేసరికి " ఆ నమ్మకం లేకే ఇంతవరకు వంట చేయలేదు. ఒకవేళ చేయాల్సి వస్తే వేరుశెనగగుళ్ళను ఉడకపెట్టడం నేను ఒక్కడినే చేస్తాను" అన్నాడు. "మలయాళంలో అమ్మాయిలంతా మిమ్మల్ని బావ అని పిలుచుకుంటారు" అనేసరికి నాని ఆన్సర్ చెప్పకుండా ఇదేదో ఆడియన్స్ అడిగిన ప్రశ్నల్లా లేవు అని కౌంటర్ ఇచ్చాడు. ఇలా ఆది కూడా శేఖర్ మాస్టర్ ని కొన్ని ప్రశ్నలు అడిగి ఎంటర్టైన్ చేసాడు. ఇలా ఈ వారంతో ఢీ సీజన్ 16 ముగిసింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.