English | Telugu
ఇలా చూడగానే అలా డాన్స్..అందుకే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం
Updated : Dec 13, 2023
అలీతో ఆల్ ఇన్ వన్ షో ఈ వారం చాల సరదాసరదాగా సాగింది. ఈ షోకి జబర్దస్త్ కమెడియన్ సద్దాం, డాన్సర్ పండు, సింగర్ సమీరా భరద్వాజ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ముందుగా పండుతో దోచేయ్ గేమ్ ని ఆడించాడు ఆలీ. "మన తెలుగు ఇండస్ట్రీలో స్క్రీన్ మీద చూసినప్పుడు అబ్బా ఎవరా హీరో ఇంత బాగా డాన్స్ చేస్తున్నారు అని అడిగితె ఎవరు పేరు చెప్తావ్" అంటూ ఆలీ అడిగేసరికి "జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం..అయన డాన్స్ బాగా వేస్తారు.
ఆయన అన్ని మూవీస్ ఫాలో అవుతూ ఉంటాను. ఒకసారి నేను జై లవకుశ మూవీ షూటింగ్ కి వెళ్లాను. ఆ టైంలో ట్రింగ్ ట్రింగ్ అనే సాంగ్ షూటింగ్ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడే లొకేషన్ కి వచ్చారు అప్పుడే చూసి వెంటనే వేసేసారు. డాన్స్ మూవ్మెంట్స్ ని గుర్తుపెట్టుకుని స్టెప్స్ వేయడం అంటే డాన్సర్స్ గా మాకే చాలా కష్టం. 32 కౌంట్స్ ని గుర్తు పెట్టుకోవాలి అంటే చాల టఫ్. కానీ ఆయన మాత్రం అలా కాదు. శేఖర్ మాష్టర్ డాన్స్ స్టెప్స్ ని హాఫ్ హాఫ్ కౌంట్స్ చూపించారు అవి చూసారు..వెంటనే టేక్ కి వెళ్లిపోయారు.
టేక్ కూడా ఓకే ఐపోయింది. నాకే చాల ఆశ్చర్యమేసింది. ఇంత షార్ప్ గా ఉన్నారేమిటా అనిపించింది. ఒక డాన్సర్ కి ముందుగా కావాల్సింది అదే. ఏ స్టెప్ చూపిస్తే ఆ స్టెప్ అలాగే షూటింగ్ లో దింపేయడమే. డాన్స్ నేర్చుకుని స్టైలిష్ గా పెర్ఫార్మ్ చేయడం ఒక ఎత్తు కానీ ఇలా చూసి అలా గుర్తుపెట్టుకుని వెంటనే టేక్ లో ఓకే ఐపోవడం అనేది ఆయన గొప్పతనం. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాల ఇష్టం. పండు ఈమధ్య బుల్లితెర మీద అన్ని రకాల షోస్ లో కనిపిస్తూ తనదైన స్టైల్ డాన్స్ వేస్తూ అలరిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు.