English | Telugu

బయటపడ్డ అఖిల్ బాగోతం.. ఫోటో కాస్త మంచిది పెట్టండి!

బిగ్ బాస్ సీజన్-7 విజయవంతంగా ముగిసింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ గా అమర్ దీపు రన్నర్ గా నిలిచి కోట్లాది ప్రేక్షకుల ఉత్సాహానికి తెర దించారు. అయితే బిగ్ బాస్ రన్నర్ అయిన అమర్ దీప్ తన భార్య తేజస్విని గౌడ, తల్లితో కలిసి అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు వస్తుండగా కొంతమంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అతని కార్ పై దాడి చేశారు. ఇది నిన్నంతా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వార్తను హైలైట్ చేయడానికి కొన్ని యూట్యూబ్ ఛానెల్ వాళ్ళు అఖిల్ సార్థక్ పేరుని వాడుకున్నారంట. ఇది మరీ దారుణం రా అంటూ అఖిల్ సార్థక్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

రాజ్ కి ముద్దు పెట్టేసిన కావ్య...

ఇయర్ ఎండింగ్  కి వచ్చేసాం. కొత్త ఏడాదిలోకి మరి కొద్ది రోజుల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ఇక బుల్లితెర మంచి కలర్ ఫుల్ గా తయారయ్యింది. ఇప్పటినుంచే ఇయర్ ఎండింగ్ సెలెబ్రేషన్స్ ని మొదలు పెట్టేసింది. ఈ కాన్సెప్ట్ తో "మోస్ట్ అవైటెడ్ దావత్..మ్యాడ్" పేరుతో ఒక ఈవెంట్ స్టార్ మాలో రాబోతోంది. ఇందులో బ్రాహాముడి సీరియల్ హీరో, హీరోయిన్స్ రెచ్చిపోయారు. "సీరియల్ వెర్సెస్ రియల్" థీమ్‌తో ఈ ఈవెంట్ జరిగింది. సీరియల్ సెలబ్రెటీలంతా ఒకవైపు.. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ ని మరో వైపుకు కూర్చోపెట్టి రచ్చ చేశారు యాంకర్లు రవి, వర్షిణి. ఇక ఈవెంట్‌కి "బబుల్‌గమ్" మూవీ టీమ్, "బలగం" మూవీ  హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్, ఇంద్రజ హాజరయ్యారు.