English | Telugu

‘కార్తీక దీపం’ వంటలక్క మిస్సింగ్.. వెతికి పెట్టండంటూ అడిగిన నెటిజన్

కొన్ని నెలల క్రితం వరకు స్టార్ మాలో ప్రసారమైన కార్తీక దీపం సీరియల్ మస్త్ ఫేమస్ అయ్యింది. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఈ మూడు క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతూనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త సెన్సేషన్ సృష్టిస్తూ ఉండేది ఈ సీరియల్. వంటలక్కగా ప్రేమి విశ్వనాధ్ నటన అద్భుతః అనే ఆడియన్స్ చాల ఎక్కువ. ఇక సీరియల్ ఐపోయినా కూడా నిరుపమ్ పరిటాలను డాక్టర్ బాబు అనే పిలుస్తూ ఉంటారు. ఇక ప్రేమి విశ్వనాధ్, నిరుపమ్ జోడీగా కార్తీక దీపం సీక్వెల్ ఉంటుందని అప్పట్లో టాక్ వచ్చింది కానీ దాని గురించి అసలు ఇంతవరకు అప్ డేట్ ఏమీ లేదు. ఇక ప్రేమి విశ్వనాధ్ మాత్రం సీరియల్ ఐపోయిన తరువాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.

రీసెంట్ గా వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాధ్ ఇన్స్టాగ్రామ్ లో శారీ ఫోటో షూట్ కి చెందిన పిక్స్ ని పోస్ట్ చేసింది. "మిమ్మల్ని మీరే కాదు మీరు వేసుకునే అవుట్ ఫిట్ కూడా అందంగా మార్చుతుంది" అంటూ ఒక కాప్షన్ పెట్టింది. ఇక వంటలక్క పిక్స్ కి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. " హలో మేడమ్..మా ప్రేమి గారు మిస్ అయ్యారు కొంచెం వెతికి పెడతారా..మీరు ప్రేమి గారి చిన్న చెల్లెలే కదా..హాయ్ మై డార్లింగ్, మై స్వీట్ మెమరబుల్, నా ఫేవరెట్ దీపా, ఎలా ఉన్నావు, నువ్వు ఎప్పుడు వస్తావు.. ప్రపంచంలోని అత్యుత్తమమైన, అందమైన వాటిల్లో ఒకటి నీ చిరునవ్వు, రెండవది నీ ప్రేమ...వావ్ సూపర్ మై ఏంజెల్ ..మీరు చూడడానికి నయనతారలా, ఉంది, జ్యోతికలా ఉన్నారు ప్రేమి మామ్ " అంటూ వాళ్ళ ప్రేమను, అభిమానాన్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేశారు. ఇక కార్తీక దీపం సీరియల్ లో లేడీ విలన్ గా హీరోయిన్ తో సమానగ్గ నటించిన మోనిత బిగ్ బాస్ సీజన్ 7 లో మిగతా కంటెస్టెంట్స్ కి టఫ్ ఫైట్ ఇచ్చి రీసెంట్ గా ఎలిమినేట్ అయ్యింది.. ఇక ఈ ముగ్గురు తిరిగి ఏదైనా సీరియల్ కనిపిస్తారా...? కనిపిస్తే బాగుండు అనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.