English | Telugu
రైతుబిడ్డకి బిగ్ బాస్ గిఫ్ట్.. అటు లవ్ ట్రాక్.. ఇటు స్పైతో స్నేహం!
Updated : Dec 13, 2023
ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ అన్ని సీజన్లలో ఒక కామన్ మ్యాన్ గ్రాంఢ్ ఫినాలేకి రావడం ఇధే ప్రథమం. బిగ్ బాస్ సీజన్-7 లో కామన్ మ్యాన్ క్యాటగిరీలో అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఎవరూ ఊహించనంత స్థాయికి ఎదిగాడు. పల్లవి ప్రశాంత్ ఫైనల్ కప్ కి ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు. ప్రస్తుతం అర్జున్, యావర్, శివాజీ, ప్రియాంక, ప్రశాంత్, అమర్‌దీప్ హౌస్ లో ఉన్నారు.
ఇప్పటికే బిగ్ బాస్ పద్నాలుగు వారాలు పూర్తిచేసుకొని పదిహేనవ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ చివరిదైన ఫినాలే వీక్ లో హౌస్ మేట్స్ యొక్క జర్నీ వీడియోలని చూపిస్తున్నాడు బిగ్ బాస్. మొన్న జరిగిన ఎపిసోడ్ శివాజీ జర్నీ వీడియోని టీవీలో చూసినవాళ్ళే ఎక్కువని టీఆర్పీలో చూస్తే అర్థమవుతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మొదట యావర్ జర్నీ చూపించిన బిగ్ బాస్.. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ జర్నీ వీడియోని చూపించాడు. చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలోని 'ఘల్లు ఘల్లుమని' పాటతో ప్రారంభించాడు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో తన ఫోటోలని చూసుకున్నాడు ప్రశాంత్. కాసేపటికి యాక్టివిటి ఏరియాకి రమ్మన్నాడు బిగ్ బాస్. "మట్టితో మనకున్న బంధం ప్రత్యేకమైనది. ఆ మట్టే మిగతావారికంటే నిన్ను ప్రత్యేకంగా చేసింది. మిమ్మల్ని ఆదరించి ఎంతోమంది మద్దతుగా కామన్ మ్యాన్ గా ఈ ఇంట్లో అడుగుపెట్టారు. మీ ప్రయాణం మొదలైనప్పటి నుండి ఎన్నో అనుభవాలు.. ఎవరి ఉద్దేశాలేంటో, ఎవరు మీవారో? ఎవరు కాదో తెలియక సంకోచంలో పడ్డ మీకు.. మిమ్మల్ని సరైన దిశలో నడిపే బంధం మీకు దొరికింది. మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు దొరికిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టాస్క్ లలో గెలవడానికి మీ రక్తాన్ని సైతం చిందించడానికి వెనుకాడలేదు. ఆ తెగింపే మిమ్మల్ని సీజన్-7 మొదటి కెప్టెన్ ని చేసింది " అని బిగ్ బాస్ చెప్పగా.. థాంక్స్ అని ప్రశాంత్ అన్నాడు.
"మీ కలని పట్టువదలకుండా ఇక్కడివరకు వచ్చి నెరవేర్చుకున్నారు. మిమ్మల్ని చూసే ఎందరికో పెద్ద కలలు కనడానికి, అవి నెరవేరేందుకు మొండి ధైర్యం ఉంటే సాధ్యమని ఎక్కడ తగ్గేదేలే లేదని నిరూపించారు. ఆకాశం నుండి జారే ప్రతీ నీటి బొట్టు భూమి మీద జీవానికి ఒక అవకాశమే.. దాన్ని ఒడిసిపట్టే నైపుణ్యమే విజయం. మీ జీవితంలో వచ్చే అవకాశాలన్ని ఒడిసిపట్టే నైపుణ్యం ఈ ఇల్లు మీకు నేర్పిందని మీ ప్రయాణం ఓ సారి చూద్దాం" అంటూ జర్నీ వీడియోని చూపించాడు బిగ్ బాస్. "మహర్షి" సినిమాలోని 'భల్లుమంటు నింగి వొల్లు విరిగెను గడ్డిపరకతోన' పాటతో జర్నీ ప్రారంభించిన బిగ్ బాస్.. పండించిన బియ్యం ప్రశాంత్ గిఫ్ట్ ఇవ్వగా.. నాగార్జున ఒక మిర్చీ మొక్కని ఇచ్చాడు. శివాజీ, ప్రశాంత్, పల్లవి ప్రశాంత్ ల మధ్య ఉన్న స్నేహాన్ని, రతిక-ప్రశాంత్ ల మధ్య లవ్ ట్రాక్ ని అద్భుతంగా చూపించాడు బిగ్ బాస్.