English | Telugu

షకీలా కన్నడ బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్

షకీలా కన్నడ బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్

షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బోల్డ్ మూవీస్ కి సెంటరాఫ్ అట్రాక్షన్, కేరాఫ్ అడ్రెస్స్ ఏదైనా చెప్పొచ్చు. బోల్డ్ మూవీస్, బోల్డ్ సీన్స్ అనే పేరు వస్తే మొదటిగా గుర్తొచ్చే నటి షకీలా మాత్రమే. ఇక ఆమె కానీ ఆమె మూవీస్ కానీ సృష్టించిన సెన్సేషన్ మామూలు కాదు. మలయాళంలో షకీలా సినిమా రిలీజ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యేది. ఎందుకంటే ఆమె మూవీ రిలీజ్ అంటే మిగతా మూవీస్ ఆడవు కలెక్షన్స్ రావు అనే భయం ఉండేది.  దాని కారణంగా ఆమె సినిమాలను బ్యాన్ చేసింది  మాలీవుడ్. షకీలా కూడా మరో దారి లేక మూవీస్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..