English | Telugu

Krishna Mukunda Murari:మోసగాళ్ళకు మోసగాడు దొరికేశాడు.. కథలో సరికొత్త ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -362 లో.. దేవ్ తప్పు చేసాడని ఇంట్లో అందరికి తెలుస్తుంది. దాంతో నేనే నా చెల్లెలి లైఫ్ బాగుండాలని ఇలా చేసాను. ఈ విషయాలన్ని ముకుందకి తెలియదు అని దేవ్ అంటాడు. ఇక తనకి ఏం తెలియదు అన్నట్లు గా ముకుంద పర్ఫార్మెన్స్ ఉంటుంది. నాకు ఇదంతా ఎందుకు చెప్పలేదని దేవ్ ని ముకుంద తిడుతు ఏడుస్తుంది.

ఆ తర్వాత పోలీసులు దేవ్ ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఇక నువ్వే నా కోడలు అని కృష్ణని రేవతి దగ్గరకి తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. రేవతితో పాటు మురారి, నందు, గౌతమ్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు కృష్ణ ఇంకా ఇంటికి రాలేదు ఏం జరిగిందో ఏమో.. నేను వెళ్లి చూస్తానని శకుంతల అనుకుంటుంది. అప్పుడే కృష్ణ హుషారుగా వచ్చి జరిగింది మొత్తం శకుంతలకి చెప్తుంది. శకుంతల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను వెళ్లి ఏసీపీ సర్ ని తీసుకొని వస్తాను. భోజనం చేద్దామని కృష్ణ వెళ్తుంది. మరొకవైపు ముకుంద ఏడుస్తుంటే.. నువ్వు ఫస్ట్ ఆ ఏడవడం ఆపు ఈ నాటకాలన్నీ ఆపు. మీ అన్నలాగే నువ్వు నాటకం ఆడుతున్నవని భవాని అనగానే.. నాకేం తెలియదని ముకుంద అందరిని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎవరు నమ్మరు. నేను మా అన్న కలిసి మోసం చేశామని మీరు అందరూ నమ్ముతున్నారా అని ముకుంద అనగానే.. నేను నమ్మట్లేదని కృష్ణ అంటుంది.

అ తర్వాత మీరు ముకుంద ని క్షమించండి అత్తయ్య అని భవానిని‌ కృష్ణ అడుగుతుంది. నేను క్షమించను. చట్టం నీ అన్నకి శిక్ష వేస్తే నేను నీకు వేస్తున్నాను. ఆ తర్వాత ఎన్ని తప్పులు చేసిన నాకు సపోర్ట్ గా మాట్లాడుతున్నవ్ ఇక నేను మారిపోయానని కృష్ణకి ముకుంద చెప్తుంది. ఇక ఎప్పటికే కృష్ణనే నీ భార్య అని మురారితో ముకుంద చెప్తుంది. అత్తయ్య ముకుందని క్షమించండి అని భవానిని కృష్ణ రిక్వెస్ట్ చేస్తుంది. సరే చేస్తాను.. కానీ భవిష్యత్తులో ఏం జరిగిన నీదే బాధ్యత అని నువ్వు అంటే క్షమిస్తానని భవాని అంటుంది. దానికి కృష్ణ సరేనని అంటుంది. తరువాయి భాగంలో ఇన్ని రోజులు కృష్ణ తప్పు చేసిందని తనని అవుట్ హౌస్ లో ఉంచారు కదా.. ఇప్పుడు తను ఏం తప్పు చెయ్యలేదని తెలిసింది కదా.. ఇప్పుడు ఇంట్లోకి రమ్మని చెప్పండి నేను అవుట్ హౌస్ లో ఉంటాను అత్తయ్య అని భవానితో ముకుంద చెప్తుంది. దానికి మురారి.. అవును కరెక్ట్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.