English | Telugu

ఇద్దరు డాక్టర్ బాబులతో మీ మోనిత !

బుల్లితెర అభిమానులకి మోనితగా పరిచయమైన శోభాశెట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. కాగా ఈ మధ్య శోభాశెట్టిని చూసి నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అతడి బాయ్ ఫ్రెండ్ యశ్వంత్ తాజాగా ఓ ప్రోగ్రామ్ లో శోభాకి రింగ్ తొడిగాడు. అది చూసి రింగ్ తొడిగే ముందే ఆలోచించాల్సింది యశ్వంత్ బ్రో అంటూ నెటిజన్లు తెగ జాలిపడుతున్నారు. కాగా శోభాశెట్టి మాత్రం ఆ వార్తలని పట్టించుకోకుండా తనకి నచ్చిన వ్లాగ్స్ చేసుకుంటు నా రూటే సపరేటు అంటూ వెళ్ళిపోతుంది.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో శోభాశెట్టి ఎంట్రీ ఇచ్చింది. కార్తీక దీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు మోనితగా పరిచయం అయిన ఈ కన్నడ భామ.. బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంట్రీతో ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. కార్తీక దీపం సీరియల్ లో యశ్వంత్ పరిచయం కాగా అప్పటి నుండి మా పరిచయం మొదలైందని శోభాశెట్టి చాలాసార్లు చెప్పింది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాకే తన బాయ్ ఫ్రెండ్ గురించి అందరికి తెలిసింది. హౌస్ లో ఉన్నప్పుడు యశ్వంత్ వస్తాడని శోభాశెట్టి అనుకుందంట. కానీ వాళ్ళ అమ్మ వచ్చింది. ‌ఇక వాళ్ళ అమ్మ రాగానే మోస్ట్ ఎమోషనల్ అయిన శోభాశెట్టి తన ఆటతీరు, ప్రవర్తన అన్నీ అడిగి తెలుసుకుంది. అయితే హౌస్ లో అమర్ దీప్, ప్రియాంక జైన్ లతో కలిసి తను ఆడిన గ్రూప్ గేమ్స్, కన్నింగ్ ఆలోచనలు అన్నీ బిగ్ బాస్ అభిమానులకి గుర్తున్నాయి. ఇక కార్తీక దీపంలో శోభాశెట్టి నటనకి తాజాగా ఓ అవార్డు కూడా వచ్చింది. హౌస్ లో తను ఎన్ని ఫౌల్ గేమ్స్ ఆడినా, నామినేషన్ లో లీస్ట్ లో ఉన్నా బిగ్ బాస్ మాత్రం ఎలిమినేషన్ చేయలేదు. దాంతో శోభాశెట్టిని బిగ్ బాస్ దత్తపుత్రిక అని కూడా అన్నారు. ఇక ఎంత ట్రోల్స్ చేసిన ఎలిమినేషన్ చేయకపోవడంతో మరో వారంలో గ్రాంఢ్ ఫినాలే వీక్ మొదలవుతుందనగా శోభాశెట్టిని ఎలిమినేషన్ చేసి అభిమానులకి కాస్త ఊరట కల్పించాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ తర్వాత శోభాశెట్టి తన యూట్యూబ్ ఛానెల్ లో ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేసింది. వారానికి రెండు వీడియోల చొప్పున వదులుతూనే ఉంది. మొదటగా అమ్మ కోసం ఓ నక్లెస్ తీసుకున్నానంటూ.. అ తర్వాత మా అమ్మనాన్నలని రీసీవ్ చేసుకున్నానంటూ వ్లాగ్ లతో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఇద్దరు డాక్టర్ బాబులతో నేను అంటు ఓ వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణలని కలిసింది శోభా. ఇక టేస్టి తేజతో కలిసి అలా సరదాగా ర్యాంప్ వాక్ చేసిన శోభాశెట్టి.. గౌతమ్ కృష్ణ చేసిన సినిమా త్వరలో వస్తుందంటూ, దానికి సపోర్ట్ చేయండి అంటు చెప్పుకొచ్చింది.‌ కాగా తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వ్లాగ్ ‌ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..