Brahmamudi:శోభనానికి రమ్మని పిలిచిన భార్య.. కంగుతిన్న భర్త!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఎపిసోడ్ - 307 లో.. రాహుల్, రుద్రాణి మాట్లాడుకుంటారు. ఆ స్వప్న టార్చర్ చేస్తుంది రా.. చెప్పింది చేయకుంటే కేస్ పెడుతదంటరా అని రుద్రాణి అనగానే.. తను చెప్పింది నువ్వు చేస్తున్నావు కదా మమ్మీ అని రాహుల్ అనగానే.. ఇంకెంతకాలం చేయాలిరా అని రుద్రాణి అంటుంది. దానికి డెలివరీ అయ్యేవరకు చాలు అని రాహుల్ అనగానే.. రేపు పుట్టాక వాడి ముడ్డి కడుగు, మూతి కడుగు అని తర్వాత ఇంకా పనులు చెప్తుందంటు భాదపడుతుండగా.. ఏయ్ బయటేంటి ముచ్చట్లు అని స్వప్న అనగానే ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్తారు.