ట్రూత్ ఆర్ గేమ్ లో తప్పించుకున్న మురారి!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -254 లో.. కృష్ణ, ముకుంద, మురారి కలిసి షాపింగ్ కి వెళ్తారు. అంతకంటే ముందు రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ సరదాగా గేమ్ ఆడతారు ముగ్గురు. ఎలాగైనా మురారి, ముకుందల ప్రేమ విషయం కృష్ణకి చెప్పాలని ముకుంద అనుకుంటుంది. మురారి మనసులో ఉన్న అమ్మాయి ఎవరో కనుక్కోవాలని కృష్ణ అనుకుంటుంది.