English | Telugu

Guppedantha Manasu:ఆ భద్ర శైలేంద్ర మనిషే అని డౌట్.. నిలదీసిన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -968 లో.. మహేంద్రతో వసుధార ఫోన్ మాట్లాడి కట్ చేసాక.. అ భద్ర అనే అతను సెక్యూరిటీ అంటున్నావ్ కదా ఎందుకు అతనికి రిషి ఇక్కడ ఉన్నట్లు చెప్పడం లేదని చక్రపాణి అడుగుతాడు. రిషి సర్ ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పొద్దు.. తెలియద్దు.. ఆ భద్ర శైలేంద్ర మనిషేమోనని డౌట్ అందుకే చెప్పకూడదని అంటున్నానని వసుధార అంటుంది.

మరోకవైపు భద్ర ఇంటికి రాగానే.. ఎక్కడకి వెళ్ళావని భద్రని మహేంద్ర కోపంగా అడుగుతాడు. మీరు ఎందుకు అంత కోపంగా ఉన్నారని భద్ర అడుగుతాడు.. ఎక్కడ నుండి వస్తున్నావో చెప్పమని భద్ర కాలర్ పట్టుకొని మహేంద్ర అడుగుతాడు. వసుధర మేడమ్ దగ్గర నుండి వస్తున్నానని అనగానే నువ్వు ఎందుకు వెళ్ళావని మహేంద్ర అంటాడు. వసుధార మేడమ్ క్షేమంగా చూడడం నా బాధ్యత అని భద్ర అంటాడు. వసుధార అక్కడ ఉన్నట్లు నీకెలా తెలుసని అనగానే ఫణింద్ర సర్ తో వసుధార మేడమ్ చెప్పారట కాలేజీలో అందరు అనుకుంటుంటే విన్నానని భద్ర చెప్తాడు. మీకు నాపై నమ్మకం లేదా అని యాక్టింగ్ చేస్తూ మీకు నమ్మకం లేకపోతే నేను వర్క్ చెయ్యనని భద్ర అంటాడు. అదేం లేదు ఇప్పుడు ఎవరిని నమ్మలేని స్థితిలో ఉన్నాం. అందుకే ఇలా అని మహేంద్ర అంటాడు.

మరొకవైపు వసుధార, రిషి ఎటాక్ గురించి మాట్లాడుకుంటారు. అసలు మనపై ఇంత కుట్రలు చేస్తుంది ఎవరని రిషి అంటాడు. శైలేంద్ర అన్నయ్య తప్పు చేసాడు అని దాని గురించి ఏమైనా తెలిసిందా అని రిషి అడుగుతాడు. అప్పుడు జరిగింది మొత్తం వసుధార చెప్తుంది. నిజంగానే మా అన్నయ్య తప్పు చేసాడని అంటావా అని రిషి అనగానే.. ముందు ముందు తెలుస్తుంది. నేను తేలుస్తానని వసుధార అంటుంది. మరొకవైపు రిషి, వసుధారల గురించి ధరణి ఆలోచిస్తుంది. మావయ్య దగ్గరకి వెళ్లి వసుధారని కలవాలని అనుకొని ధరణి వెళ్తుంటే.. తనని ఫాలో అవుతు శైలేంద్ర వెళ్తాడు. మరొకవైపు రిషి అక్కడే ఉన్నాడేమో.. అందుకే అక్కడ ఆ వసుధార.. ఇక్కడ మహేంద్ర ఇంత ఎక్కువ చేస్తున్నారని భద్ర అనుకుంటాడు. అప్పుడే ధరణి మహేంద్రని కలవడానికి వస్తుంది. సర్ లేరు అని భద్ర చెప్పగానే.. అయ్యో మావయ్య గారు ఉంటే వసుధార దగ్గరకి వెళదామని అనుకున్నాను. మావయ్య గారు లేరా అంటూ వెనక్కి వెళ్తుంటే.. నేను తీసుకొని వెళ్తానని భద్ర ఆపాలని అనుకుంటాడు. మళ్ళీ ఏమైనా అంటారేమోనని ఆగిపోతాడు. తన వెనకాలే వచ్చిన శైలేంద్రని చూసి ఎందుకు వచ్చారంటూ సెటైర్ గా మాట్లాడుతు.. పదండి వెళదామని శైలేంద్రతో ధరణి అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి బయలుల్దేరి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.