English | Telugu

Arjun Kalyan : అర్జున్ కళ్యాణ్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్.. శ్రీసత్య కోసమేనా?

బిగ్ బాస్ తో తెలుగు టీవీ అభిమానులకి అర్జున్ కళ్యాణ్ పరిచయమ్యాడు. బిగ్‌బాస్‌ సీజన్‌ సిక్స్ లో ఏడవ కంటెస్టెంట్‌గా అర్జున్‌ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇండివిడ్యువల్ గా ఆడి తన సత్తా చాటుకునే ఓ షోలో తను ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్ళిన ఏకైక కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్.

అర్జున్ యాక్టింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ లో న్యూయార్క్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా పూర్తీ చేశాడు. 2013లో ‘చిన్న సినిమా’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తరువాత లవర్ ఫరెవర్, సూడోసైడ్, ఉప్మా తినేసింది, అన్ స్పోకెన్, పరిచయం, మిస్సమ్మ వంటి వెబ్‌ సిరీస్‌లతో గుర్తింపు పొందిన అర్జున్‌ ప్లేబ్యాక్‌, పెళ్లి కూతురి పార్టీ వంటి సినిమాల్లో నటించాడు. ఆంధ్రప్రదేశ్‌ కొవ్వూరుకి చెందిన అర్జున్ ఇప్పుడు బిగ్‌బాస్‌-6లోకి ఎంట్రీ ఇవ్వడంతో నాగార్జున అతని లవ్ స్టోరీల గురించి తెలుపమని అడగా..”జెంటిల్మెన్ ఎంత మందిని ప్రేమించాడో అన్నది అలా చెప్పాడంటూ మాటదాటేసాడు”. అయితే ట్రూత్ అండ్ డేర్ అంటూ..ఎవ్వరికీ తెలియని నిజం చెప్పమని అడగా, “తనకు జరిగిన బ్రేకప్ స్టోరీని చెప్పుకొచ్చాడు”. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో శ్రీసత్య కోసమే వెళ్ళినట్లు చాలాసార్లు చెప్పాడు అర్జున్.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అర్జున్ చాలాసార్లు శ్రీసత్య కోసమే టాస్క్ లు ఆడాడు. ఇక ఒకానొక దశలో చూసే ప్రేక్షకులకే చిరాకేసింది. మరీ ఇంత ఫేవరిజం ఉండకూడదని అర్జున్ కళ్యాణ్ ని బయటకి పంపించేశారు. అయితే ఎలిమినేషన్ తర్వాత తెలిసిన నిజాలేంటంటే.. అతను శ్రీసత్య కోసమే హౌస్ లోకి వెళ్ళాడంట. హౌస్ లోకి వెళ్ళేముందు శ్రీసత్యతో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించిన అర్జున్ కళ్యాణ్ .. తనని ఇష్టపడ్డాడంట. ఇక తను బిగ్ బాస్ కి వెళ్తుందని తెలుసుకొని తను అప్లికేషన్ ఇచ్చాడంట. అయితే తనది ట్రూ లవ్ అంటూ ఎంత చెప్పిన శ్రీసత్య మాత్రం తనది స్నేహమే అని అంది. ఇక అర్జున్ బిగ్ బాస్ తర్వాత బిబి జోడీలో వాసంతితో కలసి జోడిగా వచ్చి డ్యాన్స్ ఇరగదీశాడు. కుక్క గెటప్ లో చేసిన డ్యాన్స్ కి జడ్జులతో పాటు టీవీ అభిమానులంతా ఫిధా అయ్యారు. ప్రస్తుతం అర్జున్ కళ్యాణ్ తాజాగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు అర్జున్. అందులో ఏం ఉందంటే.. నీ లైఫ్ లో నీకోసం ఎవరైతే టైమ్ కేటాయిస్తారో వాళ్ళే ముఖ్యమైనవాళ్ళు. నువ్వు ఒకవేళ ఏదీ‌ సాధించకపోయిన ఏదైనా కోల్పోయిన నీతో ఉండేవాళ్ళే నీ వాళ్ళు. అప్పటివరకు నీకోసం ఎవరున్నారో, ఎవరుంటారో చూసుకో.. ఎవరి కోసమో నీ లైఫ్ ని అలా వదిలేయకు. నీ లైఫ్ ని నువ్వు మాక్సిమమ్ పొటెన్షియల్ గా జీవించు. వితవుట్ ఎనీ రీగ్రేట్స్ అంటు అర్జున్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు శ్రీసత్య కోసమే చేశాడమోనని అనుకుంటున్నారు. మరి అర్జున్ ఇది ఎవరికోసం చేశాడో చూడాలి. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.