English | Telugu

Krishna Mukunda murari:కృష్ణ కోసం దిగొచ్చిన‌ భవాని.. శోభనానికి ముహుర్తం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -363 లో.. కృష్ణకి సంబంధించిన ఫొటోస్ అన్నీ చూస్తూ మురారి హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడే కృష్ణ వస్తుంది. ఇద్దరు సరదాగా కాసేపు రొమాంటిక్ గా మాట్లాడుకుంటారు. కృష్ణ బల్లి వచ్చిందంటు బయపడి మురారిని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మురారికి కృష్ణ కాఫీ కలిపి ఇస్తుంది.

మరొక వైపు నిద్ర మత్తులో వస్తున్న మధుని చూసిన భవాని.. తనపై కోప్పడుతుంది. బిజినెస్ చూసుకోమని చెప్తే చూసుకోవు. సినిమాలపై ఇంట్రెస్ట్ పెట్టు అంటే అలా చెయ్యవ్. ఇంక ఏం చేస్తావని మధుకి భవాని క్లాస్ పీకుతుంది.‌ అప్పుడే ముకుంద కాఫీ తీసుకొని వచ్చి భవానికి ఇస్తుంది కానీ తాను తీసుకోదు.‌ అప్పుడే రేవతి సుమలతలు వస్తే వాళ్ళకి ముకుంద కాఫీ ఇస్తుంది. అప్పుడే కృష్ణ మురారి ఇద్దరు వస్తుంటే నువ్వు ఎప్పుడు వచ్చావని రేవతి అడుగుతుంది. ప్రొద్దున్నే మురారికి కాఫీ తీసుకొని వచ్చిందని ముకుంద అనగానే.. నన్ను చూసావా అని కృష్ణ అడుగుతుంది. చూసాను కానీ పలకరించులేదు. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళతో మాట్లాడాలని ఉంటుంది కదా అని నేను సైలెంట్ గా ఉన్నానని ముకుంద అంటుంది.‌ ఆ తర్వాత ముకుంద భవాని కాళ్ళు పట్టుకొని కృష్ణని ఇంట్లో ఉండనివ్వండి. అవసరమైతే నేను అవుటౌస్ లో ఉంటానని ముకుంద అంటుంది. అ తర్వాత మురారి కూడా కృష్ణని ఇంట్లో ఉండనివ్వండి పెద్దమ్మ అని అంటాడు. ఇక కాసేపటికి కృష్ణ ఇంట్లో ఉండడానికి భవాని ఒప్పుకుంటుంది.‌ కృష్ణ థాంక్స్ అంటూ ఓవర్ గా ఎక్సైట్ మెంట్ అవుతు ఉంటే చూడలేక భవాని వెళ్ళిపోతుంది. అందరు నవ్వుకుంటారు.

అదంతా గమనించిన‌ మధు.. ముకుంద మారలేదేమో నటిస్తుందేమోనని నాకు‌ డౌట్ ఉందంటు రేవతితో‌ చెప్తాడు. మరొక వైపు కృష్ణ, శకుంతల దగ్గరికి ముకుంద వెళ్లి క్షమించమని అడుగుతుంది. ఆ తర్వాత రేవతిని ఇండైరెక్ట్ గా శోభనానికి ముహూర్తం పెట్టించమని మురారి అడుగుతాడు. అది ఎవరికి అర్థం కాదు దాంతో ముకుంద అందరికి అర్థం అయ్యేలా చెప్తుంది. మరొకవైపు భవాని తను చేసిన తప్పుని సరిచేసుకోవాలని లాయర్ ని పిలిపించి.. ప్రభాకర్ ని బయటకు తీసుకొని రమ్మని చెప్తుంది. తరువాయి భాగంలో కృష్ణ, మురారి సరదాగా బయటకు వెళ్తారు. మరొక వైపు కృష్ణ, మురారీల అగ్రిమెంట్ పెళ్లిని పర్మినెంట్ చెయ్యలని మురారి అన్నాడని చెప్పారు కదా అని భవానితో రేవతి చెప్తుంది. ఆ బంధం శాశ్వతం కావాలంటే త్వరలోనే ముహూర్తం పెట్టిద్దామని భవాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.