English | Telugu
ఆ హనుమంతుడే పాన్ ఇండియా స్టార్...ఉస్తాద్ షోలో బాహుబలి డైలాగ్
Updated : Jan 10, 2024
హనుమాన్' చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ మూవీ హీరో, చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోయే ఉస్తాద్ షోకి గెస్ట్ గా వచ్చాడు. "సరే నా షోకి వచ్చేవాళ్లను బాబాయ్, డార్లింగ్ అని పిలుస్తూ ఉంటాను..మరి నిన్నేమని పిలవాలి.. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పాన్ ఇండియా స్టార్ వి కదా" అని షో హోస్ట్ మంచు మనోజ్ అడిగేసరికి "నేను కాదన్నా..ఆ హనుమంతుడు పాన్ ఇండియా స్టార్" అని చాలా పొలైట్ గా, హుందాగా చెప్పాడు మూవీ హీరో తేజా సజ్జ. ఈ ఆన్సర్ కి ఆడియన్స్ స్టేజి దద్దరిల్లిపోయేలా ఈలలు, కేకలు పెట్టారు. "మరి నీ లైఫ్ లో ఉస్తాద్ ఎవరు" అని మనోజ్ తేజాని అడిగాడు "చిరంజీవి గారు నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, ఉస్తాద్, మెగాస్టార్ ఎవ్రీథింగ్ ఆయనే" అని ఆన్సర్ ఇచ్చాడు తేజ.
ఇంతలో బ్యాక్ గ్రౌండ్ లో "ఇంద్ర" మూవీలో చిరంజీవి చిన్నప్పటి రోల్ లో నటించిన తేజ సజ్జ వీడియో ప్లే చేశారు. "నీ ఫ్రేమ్ పడుతూ మెగాస్టార్ అని టైటిల్ పడింది చూడు..అలాంటి అదృష్టం ప్రపంచంలో ఎవరికైనా దొరుకుతుందా" అంటూ మనోజ్ అనేసరికి ఆడియన్స్ అంతా చప్పట్లు కొట్టారు. తర్వాత మనోజ్ ఒక క్రేజీ క్వశ్చన్ అడిగాడు.."సరే మన నేషనల్ క్రష్ రష్మిక కదా మరి ఆమె క్రష్ ఎవరో తెలుసా" అని కొంటెగా అడిగేసరికి "నేనైతే బాగుంటుంది అని నా ఫీలింగ్" అని కౌంటర్ ఇచ్చాడు తేజ. తర్వాత ఈ షోకి హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వచ్చాడు. "నేను ఎన్నోసార్లు క్రికెట్ , బాడ్మింటన్ ఆడదాము అని రమ్మంటానా... రాడు. ఈ గేమ్ లో డబ్బులు వస్తాయని తెలిసేసరికి వచ్చేసాడు" అంటూ తేజ అసలు క్యారెక్టర్ ఇదే అన్నట్టుగా చెప్పాడు ప్రశాంత్...తర్వాత బాహుబలి మూవీలో "ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే నరకాల్సింది వేలు కాదు తల" అంటూ కత్తి తీసుకుని మంచి ఫోర్స్ లో డైలాగ్ చెప్పి ఎంటర్టైన్ చేసాడు ప్రశాంత్ వర్మ. ఇక ఈ మూవీ చూసిన కొంతమంది సినీ ప్రముఖుల నుంచి పాజిటివ్ టాక్ బయటికి వచ్చింది. ఇక ఈ మూవీ భారీ విజయం సాధిస్తుందని దర్శక నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. చూడాలి ఆ హనుమాన్ ఏం మాయ చేయబోతున్నాడో అని.