చమ్మక్ చంద్ర రి-ఎంట్రీ...చెల్లిని గుర్తుచేసుకుని ఏడ్చేసిన బబ్లూ
త్వరలో రాఖీ పండగ రాబోతున్న నేపథ్యంలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం రాఖీ స్పెషల్ ఈవెంట్ ఎపిసోడ్ ని రెడీ చేసింది. జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన చమ్మక్ చంద్ర ఇప్పుడు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ రాఖీ స్పెషల్ ఈవెంట్ లో మెరిశాడు. అలాగే ఢీ షోలో కూడా రీసెంట్ గా ఒక ఎపిసోడ్ కి కూడా వచ్చాడు. తనకు బాగా పేరు తెచ్చిన ఫ్యామిలీ స్కిట్ చేసాడు. కరుణ, ఐశ్వర్యకు అన్నగా నటించాడు. అలాగే వాళ్ళతో కలిసి ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేసాడు. ఇక ఈ రాఖీ స్పెషల్ ఈవెంట్ లో ఒక టాస్కు కూడా జరిగింది. మనుషులు కనిపించకుండా చేతులు మాత్రమే కనిపించేలా చేశారు. ఆ చేతులు ఎవరెవరివో గుర్తించి వాళ్ళ వాళ్ళ చెల్లెళ్లు రాఖీ కట్టారు. ఈ టాస్క్ కొంచెం ఫన్నీగా, కొంచెం ఎమోషనల్ గా సాగింది.