English | Telugu
బ్రహ్మముడి సీరియల్ అరుదైన రికార్డు.. 300 ఎపిసోడ్ లు కంప్లీట్!
Updated : Jan 10, 2024
బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా టీవీ సీరియళ్ళకి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. వీటిల్లో "కార్తీక దీపం" సీరియల్ ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. అదే టైమ్ స్లాట్ లో వచ్చిన "బ్రహ్మముడి" ఇప్పుడు అంతే క్రేజ్ సంపాదించుకుంది. ఈ సీరియల్ తో పాటు 'కృష్ణ ముకుంద మురారి', 'గుప్పెడంత మనసు' సీరియల్స్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాయి.
బ్రహ్మముడి సీరియల్ లో మొదటగా దుగ్గిరాల కుటుంబంలోని వినాయకుడి పూజకి కనకం-కృష్ణమూర్తి కుటుంబం వస్తారు. కనకం-కృష్ణమూర్తిలకి స్వప్న, కావ్య, అప్పు ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు. ఇక తను అనుభవిస్తున్న పేదింటి కష్టాలని కూతుళ్ళకి రాకూడదనుకుంటు తన పెద్ద కూతురు స్వప్నని పెద్దింటికి కోడలిని చేస్తానంటు చెప్పడంతో తను మరింతగా ఆశలు పెంచుకుంటుంది. ఇక దుగ్గిరాల ఇంటికి వచ్చి ఆ ఇంటికి తన కూతుళ్ళని కోడళ్ళుగా చేయాలని కనకం శపథం చేస్తుంది. ఇక కొన్ని కీలక ఎపిసోడ్ ల తర్వాత ఇరుకుటుంబం వాళ్ళు రాజ్, స్వప్నలకి పెళ్ళి సంబంధం ఫిక్స్ చేస్తారు. ఇక రాజ్ తో పెళ్ళి అనగా రాజ్ కన్నా రాహుల్ పెద్దోడని భావించిన స్వప్న లేచిపోతుంది. ఇక అదే ముహుర్తానికి పెళ్ళి పీటలమీద కావ్యని కూర్చోబెట్టి రాజ్ తో పెళ్ళి జరిపిస్తారు. ఇక బలవంతంగా రాజ్ ఇష్టంలేకుండా కావ్యని పెళ్ళి చేసుకోవడంతో రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక కావ్యకి అత్తపోరు అంటే ఏంటో చూపిస్తుంది. ఇక కొన్నిరోజులకి స్వప్న మళ్ళీ తిరిగొచ్చి రాహుల్ నన్ను ప్రేమించాడని చెప్పడంతో దుగ్గిరాల కుటుంబంతో పాటు కనకం-కృష్ణమూర్తి షాక్ అవుతారు. ఇక రాహుల్-స్వప్నల వివాహం జరుగుతుంది. ఇక తాజా ఎపిసోడ్ లలో కళ్యాణ్-అనామికల పెళ్ళి జరుగుతుంది. కళ్యాణ్ ని అప్పు ప్రేమించిన విషయం దుగ్గిరాల ఫ్యామిలీకి తెలస్తుంది. ఇక అప్పటివరకు కావ్యతో మంచిగా ఉన్న ధాన్యలక్ష్మి కాస్త కావ్యని దోషిగా చేస్తూ కక్ష సాధిస్తుంటుంది. ప్రతీ చిన్నదానికి కావ్యదే తప్పు అన్నట్టు నిందించడంతో కావ్యకి అందరు శత్రువులే అన్నట్టుగా సీరియల్ సాగుతుంది. మరి అనామిక-కళ్యాణ్ ల పెళ్ళి విషయంలో కావ్య చేసిన సాయం ధాన్యలక్ష్మి తెలుస్తుందా? తెలుసుకొని కావ్యకి అండగా నిలబడుతుందా చూడాలి.
బ్రహ్మముడి సీరియల్ తాజాగా మూడు వందల ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఇక ఈ సీరియల్ యూనిట్ అంతా కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సీరియల్ డైరెక్టర్ కుమార్(చింటు) పంతం ప్రతీ ఎపిసోడ్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తుంటాడు. రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ.. అటు మూడు వందల ఎపిసోడ్ లు పూర్తి చేసుకోవడంతో కవిగారుగా చేస్తున్న కళ్యాణ్, అనామిక, అపర్ణ, ధాన్యలక్ష్మి అందరు కలిసి రీల్స్ చేస్తు సెలెబ్రేట్ చేసుకున్నారు. మరో అరవై ఎపిసోడ్ పూర్తిచేసుకుంటే ఈ సీరియల్ సంవత్సరం పూర్తిచేసుకునన్నట్టవుతుంది. ఇక ఇన్ని ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్ కి ఉండే క్రేజ్ తగ్గట్లేదు. టీఆర్పీలో ఈ సీరియల్ నెంబర్ వన్ స్థానంలో ఉంది.